
మాధవన్, అనుష్క, అంజలి, శాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా నిశ్శబ్ధం అమెజాన్ ప్రైం లో విడుదలైంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. గిరీష్.జి, గోపి సుందర్, విశ్వజీత్ జయకర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు షానియల్ డియో. ఈ చిత్రంలో అనుష్క ఒక బధిర యువతిగా మాధవన్ ఛెలో ప్లేయర్ గా నటించారు.
కాగా ఇటీవల అమెజాన్ ప్రైంలో విడుదలైన ఈ చిత్రాన్ని వీక్షించిన పూరి జగన్నాథ్, చిత్ర బృందానికి అభినందనలు తెలియచేసారు.ఈ చిత్రం గురించి “సినిమా బాగుంది, ప్రియమైన హేమంత్ మధుకర్ నువ్వు చాలా ప్రతిభావంతుడివి. ఎలాంటి క్రాఫ్ట్ అయినా నువ్వు హ్యాండిల్ చెయ్యగలవు. నటీనటులు అద్భుతంగా నటించారు. సినిమాటోగ్రఫి చాలా బాగుంది. సౌండింగ్, ఎడిటింగ్ కూడా బాగున్నాయి. అంత అందమైన లోకేషన్స్ లో మీరు ప్రతీ ఫ్రేమ్, చాలా క్లారిటీగా తీసారు. తప్పకుండా నువ్వు చాలా గొప్ప దర్శకుడివి అవుతావు” అని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా అన్నారు.