పూరి చెప్పాడు సరే చార్మీ కూడా..!

సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి ఏది చేసినా సేన్సేషనే. ఆయన ప్రస్తుతం వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన తన చూట్టూ జరిగే సంఘటనల ఆధారంగా కథలను ఎంచుకుంటుంటారు. ఎక్కువగా క్రైమ్స్ మీద దృష్టి పెట్టే ఆయన దావూద్ ఇబ్రహీం కథపై ఎక్కువగా కాన్సంట్రేట్ చేసినట్లు ఉన్నాడు. 2005లోనే కంపెనీ పేరుతో దావూద్ జీవితాన్ని సినిమాగా తెరకెక్కించారు. ఇప్పుడు మళ్ళీ అతని కథనే సినిమాగా రూపొందించారు. D కంపెనీ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 15న స్పార్క్ ఓ.టి.టిలో విడుదల చేయనున్నట్లు తెలియపరిచారు.

ఇక ఆయన సాగర్ తో కలిసి స్పార్క్ ఓ.టి.టి ని లంచ్ చేసారు. ఇందులో అన్ని రకాల సినిమాలు చూడొచ్చు. ప్రస్తుతం ఆయన రూపొందించిన D కంపెని చిత్రం ఇందులోనే విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఓ.టి.టి లాంచ్ అయిన నేపథ్యంలో వర్మ శిష్యుడైన పూరి శుభాకాంక్షలు తెలిపారు. “ అందరికీ ఒక గుడ్ న్యూస్ త్వరలోనే ఒక కొత్త ఓ.టి.టి చానల్ రాబోతోంది దాని పేరు స్పార్క్. మ బాస్ రాంగోపాల్ వర్మ గారు స్టార్ట్ చేస్తున్నారు దీన్ని. మే 15న లాంచ్ కాబోతోంది ఆల్ ది బెస్ట్ సర్ ఆల్ వేస్ లవ్ యూ” అంటూ వర్మపై తనకున్న ప్రేమను ట్వీట్ రూపంలో తెలియచేసారు.

ఆయనతో పాటు చార్మింగ్ గర్ల్ చార్మీ కూడా ట్వీట్ చేసింది. “ అందరికీ హలో రాంగోపాల్ వర్మ గారు స్పార్క్ అనే కొత్త ఓ.టి.టి ఫ్లాట్ ఫార్మ్ తో మన ముందుకు వస్తున్నారు. మే 15 నుండి ఇది మొదలవనుంది స్పార్క్ ని డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి” అంటూ ట్వీట్ చేసింది. ఇక ప్రస్తుతం చార్మీ హీరోయిన్ గా బ్రేక్ తీసుకుని నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఆమె పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మిస్తున్న లైగర్ చిత్రీకరణ జరుపుకుంటోంది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.