*హైదరాబాద్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో నిర్మాతల ధర్నా*

*ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేయకుండా కాలయాపన చేస్తున్న తెలుగు నిర్మాతల మండలి.. ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ మోహన్ గౌడ్*

గత నాలుగేళ్లుగా కౌన్సిల్ లో ఉన్న సభ్యులందరికీ జమ ఖర్చులు తెలియజేయకుండా.. అలాగే రెండేళ్లకొకసారి  పెట్టాల్సిన తెలుగు నిర్మాతల మండలి ఎలక్షన్స్ నాలుగు సంవత్సరాలైనా కూడా  నిర్వహించకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారని కౌన్సిల్ లోని కొంతమంది నిర్మాతలు (సభ్యులు ) హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో రిలే నిరాహరణ దీక్ష ప్రారంభించారు.ఈ దీక్షలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ మోహన్ గౌడ్, రామకృష్ణ గౌడ్, గురురాజ్, యలమంచిలి రవిచందర్, రవీంద్ర గోపాల్, మిత్తాన ఈశ్వర్, డి. వి. గోపాల్ రావు, బానూరి నాగరాజు, పి.వీరారెడ్డి, వరప్రసాద్ లతో అనేక మంది నిర్మాతలు ఈ రిలే నిరాహార దీక్ష  శిబిరంలో పాల్గొని మీడియా సమావేశంలో  వారి ఆవేదనను తెలియజేశారు... ఈ సందర్బంగా

*ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ మోహన్ గౌడ్ మాట్లాడుతూ..* .కౌన్సిల్ అనేది 1998 లో పుట్టింది. పుట్టినప్పటి నుంచి కూడా ఒక సిస్టమేటిక్ గా కౌన్సిల్ రన్ అయ్యింది. అయితే కౌన్సిల్ లోకి ఒక వ్యక్తి ప్రవేశించినప్పటి నుంచి సిష్టం గాడి తప్పింది. నేనే రాజును, నేను ఏ .. నిర్ణయం తీసుకున్నా అది అమలు చేయాల్సిందే.. అనే విధానం మొదలైంది. కౌన్సిల్ బైలా  ప్రకారం సంవత్సరానికి ఒకసారి మెంబర్స్ కు లెక్కలు సబ్మిట్ చేయాలి. ప్రస్తుతం మాకు లెక్కలు చెప్పి మాకు నాలుగు సంవత్సరాలు అయింది. అలాగే ప్రతి నెల ఈసీ మీటింగ్ పెట్టాలి. ఇప్పటికి మేము అధికారంలొకి వచ్చి మూడు సంవత్సరాల ఆరు నెలల అయినా కూడా 10 మీటింగులు కూడా పెట్టలేదు. వారి ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అనేటటువంటి తీరు వ్యవస్థకు మంచిది కాదు, అందుకనే దీనిని మేము వ్యతిరేకిస్తున్నాను. ఎలక్షన్  జరపాలని మేము అధ్యక్షులు శ్రీ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలియజేస్తే వారు జనరల్ బాడీ మీటింగ్ పెట్టారు. వారు మాతో 15 రోజుల్లో ఎలక్షన్  స్టార్ట్ చేస్తామని చెప్పారు. అయితే వారు చెప్పిన  తర్వాత మూడు నెలలైనా కూడా ఇప్పటికీ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందని చెపుతూ  డేట్ ఫిక్స్ చేయకుండా కాలయాపన  చేస్తున్నారు. అయితే మేము కళ్యాణ్ గారితో  మీకు డేట్ అనౌన్స్ చేసేటటువంటి పవర్ ఉందని, జనరల్ బాడీకి మనం మాట ఇచ్చాం కనుక మనం ఈ విధంగా చేస్తే వ్యవస్థ మీద గౌరవం, మనమీద  నమ్మకం పోతుందని మేము చెప్పడం జరిగింది. దాంతో కళ్యాణ్ గారు ఎలక్షన్ డేట్ ఫిక్స్ చేయమని ఇక్కడి కౌన్సిల్ సెక్రటరీ  చేయకుండా  కాలయాపన  చేస్తున్నారు. వారిని మేమంతా గట్టిగా నిలదీస్తే యాన్యువల్ రిపోర్ట్ బుక్ లో ఇంకా కరెక్షన్స్ ఉన్నాయని సాకులు చెబుతూ బుక్కు నెపాన్ని అడ్డం పెట్టుకొని కాలం వెళ్ళదీస్తున్నారు.ఆ బుక్కు ఎప్పుడు రెడీ అవుతుందో తెలియదు.

కౌన్సిల్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తున్న నాకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ ఎందుకయ్యానా.. అని నేను చాలా సంవత్సరాలు మధన పడుతున్నాను. ఇందులో కమిటీ నిర్ణయాలు ఉండవు.ఒక వ్యక్తి ఏది అనుకుంటే దాన్ని అమలు చెయ్యాలని చూస్తారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఇష్టానుసారంగా వ్యవహరించే పద్దది కరెక్ట్ కాదని మేము వ్యతిరేకిస్తే మా మీద యాక్షన్ తీసుకోవాలని, మమ్మల్ని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటి వరకు ఎలక్షన్ డేట్ అనౌన్స్ కూడా చేయలేదు ఈ విధంగా ఎలక్షన్ పెట్టకుండా కాలక్షేపం చేసే వైఖరిని  వ్యతిరేకిస్తూ ఇమీడియెట్ గా ఎలక్షన్ పెట్టాలని మేము ఈ దీక్ష చేయడం జరుగుతుంది.

*నిర్మాతలకు ఒక ప్రధానమైన సమస్య డిజిటల్ ప్రొవైడర్స్*

సింగిల్ స్క్రీన్స్ లలో ఇప్పటికే విపియఫ్ చార్జెస్ బలవంతంగా వసూలు చేస్తూ నిర్మాతలను డిస్ట్రిబ్యూటర్స్ ను ఇబ్బంది పడుతున్నారు. చాలా మల్టీప్లెక్స్ థియేటర్లలో ఓనర్లకు సర్వర్లు ఉన్నప్పటికీ  నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ నుండి విపిఎస్ చార్జీలు వసూల పేరుతో దారుణమైన దోపిడి చేస్తున్నారు. థియేటర్స్ గుత్తాధిపత్యం ఒకవైపు, డిజిటల్ ప్రొవైడర్స్ గుత్తాధిపత్యం మరో వైపుతో మమ్మల్ని దోచుకుంటున్నారు. కాబట్టి ఈ విధానాన్ని మార్చుకొని ఇండస్ట్రీ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటు న్నాము. మరియు వెంటనే ఎలక్షన్ డేట్ అమలు చెయ్యాలని కోరుతూ ఈ దీక్ష  చేస్తున్నామని అన్నారు.


*నిర్మాత యలమంచిలి రవి చందర్ మాట్లాడుతూ* .. 2019లో ఎలక్షన్స్ జరిగాయి. ఆరోజు కూడా ఎలక్షన్ లలో ఎవరూ నిలబడద్దు గిల్డ్ ను కలిపేస్తామని చెప్పారు.అయితే కొంతమంది వినకపోతే  జరిగిన  ఎలక్షన్స్ ఇవి.అయితే అప్పుడు వీరంతా గిల్డ్ ను కచ్చితంగా కలుపుతామని రిజైన్ లెటర్ కూడా చదవలవాడ శ్రీనివాస్ రావు గారికి  ఇచ్చారు.ఇప్పటి వరకు కలపలేదు వేరే వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని కూడా నీరు కార్చారు. రెండేళ్లకొకసారి ఎలక్షన్స్ పెట్టాలి. అయితే నాలుగు సంవత్సరాలైనా కూడా ఎలక్షన్ పెట్టలేదు..  సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు 14 సంవత్సరాల నుంచి ఆ సీట్లో కూర్చొని వ్యవహరిస్తున్నారు ఇందులో చాలా మంది నిర్మాతలు సినిమాలు చేయని వారు ఉన్నారు. అయితే కొత్త ఎలక్షన్ జరిగి  కొత్త బాడీ వస్తే వారి ఆటలు సాగవని,  వీళ్లు ఎలక్షన్లు కట్టకుండా ఆపుతున్నారు. నాలుగేళ్లైనా ఇప్పటికి లెక్కలు చెప్పడం లేదు దాంట్లో ఏం ఉందో అర్థం కావడం లేదు.  వెల్ఫేర్ ను చంపేశారు,  ఇన్సూరెన్స్ లేదు, వారికీ ఇష్టమొచ్చిన వారికే పెన్షన్ ఇచ్చే దుర్మార్గమైన మండలి లో ఉన్న వీరు ఇంకా రెండు సంవత్సరాలైనా కూడా ఎలక్షన్ పెట్టకూడదని ఉద్దేశంతో ఉన్నారు. ఇందులో హైలెట్ ఏంటంటే అదే బాడీలో ఉన్న జాయింట్ సెక్రెటరీ మోహన్ గౌడ్ గారు ఆక్కడ జరుగుతున్న సమస్యలు చూసి తట్టుకోలేక, కౌన్సిల్ లో జరుగుతున్న పరిస్థితులు రోజురోజుకు దిగజారడం చూసి అయన ముందుకు వచ్చి ఈరోజు ఆయన నిర్ణయం తీసుకున్నారు. వారికి సంఘీభావం తెలపడానికి మేమంతా ముందుకు వచ్చాము అన్నారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.