తుదిశ్వాస విడిచిన బి.ఎ రాజు గారు... శోక సంద్రంలో సినీ పరిశ్రమ

ప్రముఖ నిర్మాత, పి.ఆర్.ఓ, ఫిల్మ్ జర్నలిస్ట్ బి.ఎ రాజు గారు గుండెపోటుతో మరణించారు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్లో జాయిన్ చేసారు. చికిత్స పొందుతూ శుక్రువారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన హఠాత్మరణంతో ఆయన కుమారుడు దిగ్భ్రాంతికి లోనయ్యారు. సినీ పరిశ్రమ ఆయన మరణం పట్ల సంతాపం తెలియచేసింది. ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ గారికి పబ్లిసిటీ మేనేజర్ గా మొదలుపెట్టి నిర్మాతగా చిత్రాలను నిర్మించే రేంజ్ కి ఎదిగారు బి.ఎ రాజు గారు. క్రిష్ణగారితో మొదలుకొని బాలకృష్ణ, నాగర్జున, చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలకు పబ్లిసిటీ మేనేజర్ గా పనిచేసారు. అక్కడి నుండి ఇండస్ట్రీలో దాదాపు హీరోలు అందరికీ పి.ఆర్.ఓగా పని చేసారు. 1500 పైగా చిత్రాలకు ఆయన పబ్లిసిటీ పార్ట్నర్ గా చేసారు. సూపర్ హిట్ అనే పత్రికను స్థాపించి సినీ వార్తలను ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసారు.

ఆయన సతీమణి బి జయ గారు దర్శకురాలు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, లవ్ లీ చిత్రాలను ఆవిడ తెరకెక్కించారు. ఆవిడ దర్శకత్వం వహించిన చిత్రాలను ఆయనే నిర్మించారు. ఆవిడ కూడా గుండె సంబంధిత సమస్య వల్లే మృతి చెందారు. ఇప్పుడు ఆయన కూడా గుండెపోటుతో మరణించడంతో సినీ ప్రముఖులు హతాశులయ్యారు. యావత్తు సినీ పరిశ్రమ ఆయనకు సంతాపం తెలియజేస్తోంది.

ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండే ఆయన మరణించడం బాధాకరం అని చిరంజీవి అన్నారు. సినీ ఇండస్ట్రీకే అంకితం అయిన ఆయన మరణించడం తీర్చలేని లోటు అని ఎన్టీఆర్ అన్నారు. బి.ఎ రాజు గారు లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను ఎన్నో ఏళ్లుగా మేము కలిసి ప్రయాణం చేస్తున్నాము. సినిమానే ప్రపంచంగా భావించిన వ్యక్తి ఆయన. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మహేష్ బాబు అన్నారు. ఇంకా ఇండస్ట్రీ లోనీ ప్రముఖులు కూడా ఆయన మృతిపట్ల తమ సంతాపం తెలియజేస్తున్నారు

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.