
తేజ దర్శకత్వం వహించిన ‘లక్ష్మి కళ్యాణం’ అనే సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్, కేవలం తెలుగు ప్రేక్షకులనే కాకుండా ఇతర బాషా ప్రేక్షకులను కూడా తనదైన శైలితో ఇటు అందంతోనూ అటు అభినయంతోనూ అందరినీ మెప్పించింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు తన సినిమాలతో ఎంతో దెగ్గరైంది. 2009లో
దర్శక ధీరుడు రాజమౌళి గారు దర్శకత్వం వహించిన ‘మగధీర’ సినిమాతో తెలుగు వారికి అత్యంత సుపరిచితురాలైంది. దాదాపు తెలుగులో అగ్ర హీరోలందరితో నటించిన కాజల్ ఉన్నట్టుండి తన వివాహం ‘గౌతమ్’ అనే ప్రముఖ పారిశ్రామిక వేత్తతో ఈ నెల 30 న జరగనున్నట్టుగా తాజాగా తన ఇన్స్టాగ్రమ్ ఖాతాల్లో వెల్లడించారు. అయితే ప్రస్తుతం
కరోనా కారణంగా కేవలం తన సన్నిహిత కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే ముంబాయ్ లోని ఒక హోటల్లో వివాహ
కార్యక్రమం జరుగబోతున్నట్లుగా ఆవిడ తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే తన వివాహానంతరం కూడా సినిమాల్లో నటిస్తానని ఆవిడ వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు తన ఫస్ట్ ఇన్నింగ్స్ లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ విధంగా రాణిస్తుందో వేచి చూడాలి.