
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నేషనల్ వైడ్ క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. బాహుబలి తో ఒక్కసారి గా దేశం మొత్తం ఫేమస్ అయ్యాడు.. ఆ సినిమా టాలీవుడ్ కే పరిమితమయిన ప్రభాస్ ని దేశం మొత్తం పరిచయమయ్యేలా చేసింది. ఆ క్రేజ్ తోనే ప్రభాస్ అయన తన సినిమాలన్నింటిని పాన్ ఇండియా సినిమాలుగా చేస్తున్నాడు.. ప్రస్తుతం అయన చేతిలో నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.. బాహుబలి సినిమా తర్వాత సాహో సినిమా నిరాశ ని మిగిల్చిన అయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

ఆ సమయంలో మరో నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఒకే చేయడం విశేషం.. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలో ముందుగా రిలీజ్ అవుతుంది రాధే శ్యామ్.. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ని సలార్ సినిమా రాబోతుంది. ఇక రెండు సినిమాల తర్వాత ప్రభాస్ ఆదిపురుష్, నాగ్ అశ్విన్ ల భారీ బడ్జెట్ సినిమాలు చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం ఒకేసారి సలార్, ఆదిపురుష్ సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నాడు.

తాజగా సలార్ షెడ్యూల్ లో ఉన్నాడు ప్రభాస్.. ఈ షెడ్యూల్లో శృతి హాసన్, ప్రభాస్ పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలను కూడా పిక్చరైజ్ చేయనున్నట్టు సమాచారం. ఐతే.. ఈ షెడ్యూల్‌ను ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ సినిమాను పిక్చరైజ్ చేసిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో చిత్రీకరించనున్నాడట. కథతో పాటు సెంటిమెంట్ కూడా కలిసొచ్చేలా ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ షూట్ చేసిన ప్రాంతాల్లో ‘సలార్’ సినిమాను పిక్చరైజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. అందుకు తగ్గట్టు స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు చేసినట్టు సమాచారం. దానికి ప్రభాస్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.మరోవైపు ప్రభాస్.. ఈ గ్యాప్‌లో ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాకు సంబంధించిన షూటింగ్లో పాల్గొననున్నాడు. ‘సలార్’ సినిమా విషయానికొస్తే.. వచ్చే యేడాది ఏప్రిల్ 14న దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకు యేడాదికి ముందే ఈ సినిమాకు ఓ భారీ ఆఫర్ వచ్చినట్టు సమాచారం.