
దేశంలోనే నెంబర్ వన్ హీరో గా అవతరించిన ప్రభాస్ రెమ్యునరేషన్ కూడా ఈ రేంజ్ లోనే ఉంటుంది.. జాతీయ మీడియా లో ఈయన రెమ్యునరేషన్ కి సంబంధించి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ట్రేడ్, సినీ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ తన సినిమాలకు సంబంధించిన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచినట్టు తెలిసింది. రెబల్ స్టార్ ప్రభాస్ కి ప్రస్తుతం దేశంలో ఏ హీరోకి లేని స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.. పాన్ ఇండియా లెవెల్లో ఈ రేంజ్ మార్కెట్ ఉన్న హీరో ప్రస్తుతానికి ఒక్క ప్రభాస్ మాత్రమే ఉన్నాడు.. ఈ విషయం ప్రభాస్ ఫ్యాన్స్ ని ఎవరిని అడిగిన గర్వంగా చెప్తాడు. అయితే ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకుపైగానే పారితోషికాన్ని తీసుకొంటున్నట్టు సమాచారం. ఇండియాలో ఏ హీరోకు కూడా ఇంత రెమ్యునరేషన్ లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

బాలీవుడ్ హీరోలకు కూడా ఈ రేంజ్ స్టార్ డమ్ అయితే దక్కలేదు.. బాహుబలి తో మొదలైన ప్రభాస్ ప్రభంజనం ఇంకా ఇంకా పెరుగుతూ పోతుందే తప్పా తగ్గట్లేదు.. మధ్య సాహో సినిమా గతి తప్పిన ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. హీరోలకు సంబంధించిన రెమ్యునరేషన్ విషయంలో మొట్టమొదటిసారి రూ.100 కోట్ల రెమ్యునరేషన్ క్లబ్‌ను ప్రారంభించిన ఘనత ప్రభాస్‌కు దక్కిందనే విషయాన్ని వెల్లడిస్తున్నారు. సల్మాన్, షారుక్, రణ్వీర్ సింగ్ లాంటి హీరోల కంటే ప్రభాస్ ఎక్కువ రెమ్యురేషన్ అందుకొంటున్నట్టు జాతీయ వెబ్సైట్ తన కథనంలో పేర్కొన్నది.

ఇక రాధే శ్యామ్ సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రభాస్.. ఈ సినిమా తరువాత సలార్ ని లైన్ లో ఉంచాడు.. ఆ తర్వాత ఆదిపురుష్, నాగ్ అశ్విన్ ల సినిమా లు లైన్ లో ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని సలార్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.. ఆదిపురుష్ కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ కి వచ్చేసింది.. వీటిని ఎంత తొందరగా అయితే అంత తొందరగా పూర్తి చేసుకుని త్వరలోనే నాగ్ అశ్విన్ తో చేతులు కలపబోతున్నాడు ప్రభాస్..