అందరూ బావుండాలి...సినిమా థియేటర్లో ఉండాలి..!

సీనియర్ నటులు నరేశ్, అలీ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’. మలయాళంలో విడుదలై సంచలన విజయంగా నమోదైన ‘వికృతి’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. సోషల్‌ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌లు సంయుక్తంగా నిర్మించారు. సుమారు 1100 సినిమాల్లో అనేక పాత్రల్లో నటించిన అలీ హీరోగా తన బ్యానర్‌లో నిర్మిస్తున్న తొలిచిత్రం కావటంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.

సినిమా షూటింగ్‌ పూర్తయిన సంరర్భంగా అలీకి అభినందనలు తెలియచేశారు యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహంతో ప్రభాస్ ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్ కోసం ఒక వీడియో చేసి పంపించారు. ఆయన మాట్లాడుతూ–‘‘ అలీ గారు అనేక సినిమాలు చేసి సినిమా పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే బ్యానర్‌ని పెట్టి సినిమాలు తీయటం చాలా ఆనందంగా ఉంది. ఆయన బ్యానర్‌ సౌండ్‌ బావుంది. ఈ సినిమా విషయానికి వస్తే ‘వికృతి’ అనే మలయాళ సినిమాను తెలుగులో ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’ అనే పేరుతో రీమేక్‌ చేశారు. మలయాళంలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా మంచి మెసేజ్‌తో తెలుగులో విడుదలవ్వటం చాలా హ్యాప్పీగా ఉంది.

కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పరిస్థితులు చక్కదిద్దుకోగానే విడుదల తేదిని ప్రకటిస్తాం అన్నారు మేకర్స్. శివబాలాజీ, మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి,సనా, వివేక్, శివారెడ్డి, సప్తగిరి, పృధ్వీ, రామ్‌జగన్, భద్రం, లాస్య తదితరులు నటించారు. ఈ చిత్రానికి చీఫ్‌ క్రియేటివ్‌ హెడ్‌– ఇర్ఫాన్, కో డైరెక్టర్‌– ప్రణవానంద్‌ కెమెరా– ఎస్‌ మురళీమోహన్‌ రెడ్డి, ఆర్ట్‌– కెవి రమణ, డాన్స్‌ డైరెక్టర్‌– స్వర్ణ, ఎడిటర్‌– సెల్వకుమార్, ఫైట్స్‌–నందు, మేకప్‌–నంద్యాల గంగాధర్, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌– సయ్యద్‌ తాజ్‌ బాషా, విఎఫ్‌ఎక్స్‌– మాయాబజార్‌ స్టూడియో

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.