బాహుబలి చిత్రంతో అంతర్జాతీయంగా గుర్తింపు సంపాదించుకున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. కాగా మరో 2-రోజుల్లో ఆయన పుట్టినరోజు రానుండగా ఇప్పటి నుంచే సెలెబ్రేషన్స్ మొదలైపోయాయి. వరసగా ప్యాన్ ఇండియా వైడ్ గా సినిమాలు చేస్తూ, అభిమానుల్లో తనకున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని పక్కా ప్లానింగ్ తో సినిమాలని సెలెక్ట్ చేసుకుంటున్నారనేది ఇండియా వైడ్ గా ఉన్న సినిమా పండితుల అభిప్రాయం. బాహుబలి సిరీస్ ప్రభాస్ కి ఎంతోమంది
అభిమానులను సంపాదించి పెట్టింది. సాహో సినిమా కూడా మంచి పేరుని తీసుకొచ్చిందనే చెప్పాలి. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులు బర్త్ డే సీ.డీ.పీ ని రిలీజ్ చేశారు. ఈ పిక్ లో అశేషమైన అభిమానుల మధ్య మన రెబల్ స్టార్ ప్రభాస్ ఉండేలా డిజైన్ చేశారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ క్రేజ్ ని తెలియ చెప్పేలా చైనా, జపాన్, నార్త్ ఇండియా నుంచి కూడా ప్రేమను పొందుతున్నట్లు చూపించే ప్రయత్నం చేశారు. ఇందులో 'సాహో' సినిమాలోని ప్రభాస్ ఫోటోని ఉపయోగిస్తూ ‘ఇండియన్ సినిమా’ అనే టైటిల్ ని మధ్యలో ఉంచారు. అలానే ఒకవైపు 'బాహుబలి' సీన్, మరోవైపు 'స్టార్' సింబల్ ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ బర్త్ డే కామన్ డీపీ వైరల్ అవుతోంది నెటిజన్లు లైకులతో, కామెంట్లతో ప్రభాస్ కి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న రాధే శ్యామ్ చిత్రం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.