మహాసముద్రం నుంచి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..!!

శర్వానంద్ హీరోగా చేసిన గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కాకపోవడంతో అయన చేయబోయే తదుపరి చిత్రం మహాసముద్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. శతమానం భవతి తర్వాత హిట్ అందుకోలేదు శర్వానంద్. దాంతో అయన చేయబోయే ఈ సినిమా హిట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు.. RX100 సినిమా తో మంచి గుర్తింపు దక్కించుకున్న అజయ్ భూపతి ఈ సినిమా తో అదే రేంజ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో  సిద్ధార్థ్ ప్రధానమైన పాత్ర ను పోషిస్తున్నారు.  నాయికలుగా అదితీరావు .. అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఒక ప్రత్యేకమైన పాత్రలో 'గరుడ' రామ్ కనిపించనున్నాడు. ఆయన ఈ సినిమాలో 'ధనుంజయ్' అనే పాత్రను పోషిస్తున్నాడు. ఆయన పాత్రను .. ఆయన లుక్ ను పరిచయం చేస్తూ ఈ రోజున ఒక పోస్టర్ ను వదిలారు.

గరుడ రామ్ పాత్ర ఈ సినిమాలో ఎలా ఉంటుందనేది ఈ పోస్టర్ చూస్తేనే అర్థమైపోతుంది. 'కేజీఎఫ్' సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న 'గరుడ' రామ్, ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలవనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఒక్కో పాత్రకు సంబంధించిన లుక్ ను రివీల్ చేస్తూ ఉత్కంఠను పెంచుతున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.