మెట్రోలో వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా తన లుక్ ని మార్చిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ''వకీల్ సాబ్'' చిత్రం షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అయిపోయారు పవన్. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ లు కలిసి నిర్మిస్తున్నారు. 'ఓ మై ఫ్రెండ్' ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా హిందీలో ఘన విజయం సాధించిన 'పింక్' చిత్రానికి రీమేక్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ కూడా సెట్స్ లో అడుగుపెట్టేసారు. షూటింగ్ కోసం ఈ రోజు ఉదయం  హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం చేశారు. చిత్ర యూనిట్ తో కలిసి మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు పవన్ మెట్రో జర్నీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తోటి ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. మెట్రోలో పవన్ తో పాటు నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. 'వకీల్ సాబ్' సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేశారని తెలుస్తోంది. ఈ చిత్రంలో శృతి హాసన్, అంజలి, నివేదా థామస్, అనన్య, ప్రకాష్ రాజ్, నరేష్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఎస్. ఎస్. థమన్.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.