వకీల్ సాబ్ నుండి పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ వర్కింగ్ స్టిల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రీఎంట్రీ చిత్రంగా వకీల్ సాబ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అంజలి, నివేదా థామస్, అనన్య ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి వర్కింగ్ స్టిల్ ను విడుదల చేసారు వకీల్ సాబ్ టీమ్. ఈ వర్కింగ్ స్టిల్ లో పవన్ కళ్యాణ్ టెరిఫిక్ గా ఉన్నాడనే చెప్పాలి. ప్రస్తుతం సమాజంలో జరిగే అల్లర్ల వంటి ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. అందులో పవన్ కళ్యాణ్ ఒక పోలీస్ షీల్డ్ వద్ద కూర్చుని దాన్ని గమనిస్తున్నట్లుగా ఉన్న పిక్ బాగుంది. దిల్ రాజు వకీల్ సాబ్ ను నిర్మిస్తుండగా ఎస్.ఎస్ తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. వకీల్ సాబ్ ను సమ్మర్ లో విడుదల చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.