
మహా శివరాత్రి సందర్భంగా పవన్ కళ్యాణ్ సినిమా లుక్ రిలీజ్ అయ్యింది.. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా టైటిల్ ని కూడా ఈ లుక్ లో రివీల్ చేయడం విశేషం. హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ ఈ లుక్ లో ఓ రేంజ్ లో ఉన్నాడు.. చారిత్రాత్మక లుక్ లో పవన్ కళ్యాణ్ ని చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదని చెప్పాలి. ఈ లుక్ పవన్ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెడుతుండడంతో ఎలాంటి సందేహం లేదు. వకీల్ సాబ్ తర్వాత సరైన అప్ డేట్ లేక అల్లాడిపోతున్న పవన్ ఫ్యాన్స్ కి ఈ లుక్ వచ్చాక పండగ చేసుకుంటున్నారు..
అంతేకాకుండా యూనిట్ విడుదల చేసిన చిన్న గ్లిమ్ప్స్ లో పడవపైకి దూకడం కూడా చూపించారు.. ఈ సినిమాలో పవన్ వజ్రాల దొంగగా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్నాడు. కొంత షూటింగ్ కూడ జరుపుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇటీవలే కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ సినిమాలో పవన్ సరసన టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నదని టాక్.

ఇక పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ రిలీజ్ కి రెడీ గా ఉంది.. మరోవైపు ఏకే రీమేక్ సినిమా కూడా త్వత్వరగా షూటింగ్ జరుపుకుంటుంది. త్రివిక్రమ్ దీనికి మాటలందిస్తున్నాడు. ఈ మూడు సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి ల దర్శకత్వంలో చెరో సినిమా చేయాల్సి ఉంది.. మొత్తానికి ఎన్నికల లోపు పవన్ మాక్జిమం సినిమాలు చేయాలనీ డిసైడ్ అయినట్లు ఉన్నాడు.