తెలుగులో త్వరలోనే కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటిస్తోన్న చిత్రం యువరత్న రాబోతుంది. సంతోష్ ఆనంద్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.ఇక ఈ చిత్రం నుంచి పవర్ ఆఫ్ యూత్ సాంగ్ లిరికల్ వీడియోని మేకర్స్ విడుదల చేశారు. జగోరే జగో అనే మొదలయ్యే ఈ పాట వినడానికి చాలా బాగుంది. ఈ పాట ని తెలుగులో బాగా పేరు ఉన్న రామజోగయ్య శాస్త్రి గారు రాసారు. అలాగే నకాస్ అజీజ్ పాట పాడగా ఎస్.ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో సయేషా సెహెగల్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రకాశ్ రాజ్, సోనూ గౌడ, దిగంత్ మంచలే, ధనంజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడలో వరస బ్లాక్ బస్టర్స్ తో పునీత్ రాజకుమార్ దూసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు తెలుగులో కూడా అడుగుపెట్టి ఆయన తన మార్కెట్ ని పెంచుకునే పనిలో ఉన్నారు. ఇంకో విశేషం ఏంటి అంటే పునీత్ సింగర్‌గా కూడా ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు. అలాగే ఈ సినిమాని 'KGF' సినిమాను నిర్మించిన హోంబళే ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్నారు. తెలుగులో విడుదల కాబోతున్న మొదటి చిత్రం కావడంతో పునీత్ అందరి మద్దతు కావాలని ఈ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తెలుగు లో పవన్ కళ్యాణ్ లాగానే కన్నడ సినీ పరిశ్రమలో పునీత్ ని పవర్ స్టార్‌గా పిలుస్తారు.