
ఒకప్పుడు వెండితెరపై కనిపించి సందడి చేసిన నటి పూనమ్ కౌర్.. సినిమాల్లో ఉన్నపుడు అంత పెద్ద సక్సెస్ కాలేదు కానీ సినిమా ల నుంచి వెళ్ళిపోయాక మాత్రం ఆమె చాల ఫేమస్ అయిపొయింది. అప్పట్లో కత్తి మహేష్ వర్సెస్ పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ మధ్య జరిగిన సోషల్ మీడియా యుద్దంలో పూనమ్ ని లాగి ఆమె ఇమేజ్ ని రచ్చ రచ్చ చేశారు. ఆమెపై రక రకాల పుకార్లు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. పూనమ్ కు పవన్ కళ్యాణ్ తో ఎఫైర్ ఉందనే వార్తలు ఈ ఇష్యూ తర్వాత వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఇప్పటికీ ఆమెపై పలు యూట్యూబ్ చానెళ్ళు పలు రకాల వార్తలను ప్రచారం చేస్తున్నాయి. వివాదం ఏమో కానీ సోషల్ మీడియాలో ఎక్కువ పాపులర్ అవుతూ రోజు రోజుకి తన ఇమేజ్ పెంచుకుంటుంది..అయితే ఆ విషయంపై అప్పుడేం స్పందించలేదు కానీ ఆమధ్య తనపై యూట్యూబ్‌లో అభ్యంతరకరమైన పోస్టింగ్‌లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సినీనటి పూనం కౌర్ సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలీదు.

ఇకపోతే తాజాగా ఆమె ఎన్టీఆర్ గురించి చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఎన్టీఆర్ గార్డెన్స్ అని రాసి ఉన్న ల్యాండ్ మార్క్ ఫోటో తో పాటు 'రేస్ ఆఫ్ హోప్'(ఆశా కిరణాలు) అనే కామెంట్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సాధారణ సందర్భం అయితే ఈ ట్వీట్ కి అంత ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ నిన్న వెలువడిన ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ ఎన్నికల పలితాలలో టీడీపీ ఘోరపరాజయం చవిచూసింది. దారుణంగా రాష్ట్రం మొత్తం మీద ఒక్కటంటే ఒక్క మున్సిపాలిటీ గెలుచుకుంది.టీడీపీ పార్టీ ఘోర ఓటమి తరువాత చాలా మంది టీడీపీ కార్యకర్తలు అధినేత చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నాయకత్వ మార్పు కావాలని, జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాలని కోరుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మాత్రమే టీడీపీని కాపాడగలడు అని అర్థం వచ్చేలా పూనమ్ కౌర్ ట్వీట్ చేయడం వివాదాస్పదంగా మారింది. పూనమ్ కౌర్ ట్వీట్ క్రింద ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చూసినా... ఆమె ఉద్దేశం ఏమిటో అర్థం అవుతుంది.