
నితిన్, కీర్తి సురేష్ లు జంటగా నటిస్తున్న సినిమా రంగ్ దే.. వెంకీ అట్లూరి ఈ సినిమా కి దర్శకుడు కాగా ఈ సినిమా తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు.. తొలి సినిమాగా వచ్చిన తొలిప్రేమ హిట్ కాగా, అఖిల్ మిస్టర్ మజ్ను కూడా మంచి హిట్ సాధించింది.. ఇప్పుడు నితిన్ తో చేస్తున్న రంగ్ దే సినిమా కూడా మంచి హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాలని అయన చూస్తున్నారు.. ఇష్క్ సినిమా తో మళ్ళీ కామ్ బ్యాక్ చేసిన నితిన్ ఆ తర్వాత వరుస హిట్ లు అందుకున్నాడు..

ఇటీవలే భీష్మ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్ ఈమధ్యే వచ్చిన చెక్ తో ఆ జోరు ను కొనసాగించేలేకపోయాడు. ఆ సినిమా నితిన్ కెరీర్ లోనే అత్యంత డిజాస్టర్ గా మిగిలిపోయింది. విడుదలైన రెండో రోజు నుంచే ఆ సినిమా కలెక్షన్లు చాల డ్రాప్ అయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం రంగ్ దే సినిమాపై మంచి హోప్స్ పెట్టుకున్నాడు నితిన్.. ఈ సినిమా పై మంచి పాజిటివ్ బజ్ నడుస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు, టీజర్, ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది.
MISSING
— nithiin (@actor_nithiin) March 20, 2021
KANABADUTALEDHU
Dear anu,
nuvvu ekkadunna RANG DE promotions lo join avvalani maa korika..
Itlu nee arjun
😈😈😈😈 #Rangdeonmarch26 pic.twitter.com/fpnv06ebCb
అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతుండంతో ఈ సినిమా ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది చిత్ర బృందం.. కొంచెం వెరైటీ గా ప్రమోషన్స్ చేయాలనీ నిర్ణయించగా నితిన్ ఇటీవలే కీర్తి సురేష్ కనపడడం లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కీర్తి చిన్నప్పటి ఫోటో ను పెట్టి మిస్సింగ్.. కనబడుటలేదు.. డియర్ అను.. నువ్వు ఎక్కడ ఉన్న రంగ్ దే ప్రమోషన్స్ లో జాయిన్ అవ్వాలని మా కోరిక. ఇట్లు నీ అర్జున్” అని రాసుకొచ్చాడు.ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుండగా దీనికి హైదరాబాద్ పోలీసులు స్పందించడం కొసమెరుపు. 'డోంట్ వర్రీ.. నితిన్. మేము చూసుకుంటాం' అంటూ పోలీసులు బదులిచ్చారు. ఈనెల 28 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.