భరోసాను పెంచిన ఫిబ్రవరిభరోసాను పెంచిన ఫిబ్రవరి

కరోన నుండి కోలుకుని థియేటర్లు ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతున్నాయి. జనవరీలో విడుదలైన చిత్రాలు మిశ్రమ ఫలితాల్ని అందుకుని పర్వాలేదనిపించాయి. తెలుగు చిత్రాల్లో క్రాక్ మినహా మరే చిత్రమూ అంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. భారి అంచనాల నడుమ విడుదలైన రెడ్ చిత్రం కూడా ఆశించినంత హిట్ అవ్వలేదు. ఓ మోస్తరుగా హిట్ అయినా రామ్ కు కాస్త నిరాశే మిగిల్చింది. ఇక ఆ తర్వాత విడుదలైన చాలా చిత్రాలు అనుకునన్నంత హిట్ అవ్వలేదు. ఆ తర్వాత ఫిబ్రవరిలో సినిమాలు క్యూ కట్టాయి. ముందుగా విడుదలైన జోంబీ రెడ్డి చిత్రం విజయ ఢంకా మోగించింది. ఈ చిత్రం 15 కోట్ల వరకూ వసూలు చేసి ఫిబ్రవరిని ఘనంగా ప్రారంభించింది. ఇక రెండో వారంలో విడుదలై ఆ జైత్ర యాత్రను కొనసాగించిన ఉప్పెన చిత్రం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడో ఉదయ్ కిరణ్, నితిన్ లు తోలి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు. ఆ తర్వాత మరే హీరో తోలి చిత్రం ఇంత సక్సస్ అవ్వలేదు. అలాంటి హిట్ ను ఉప్పెనతో తన ఖాతాలో వేసుకున్నాడు వైష్ణవ్ తేజ్ ఈ చిత్రం దాదాపుగా 75 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అల్లరి నరేష్ నాంది కూడా ఈ ఫిబ్రవరిలోనే విడుదలైంది. ఈ చిత్రం హిట్ అయ్యి నరేష్ ను గాడిలో పడేసింది. ఎన్నో ఏళ్లుగా హిట్ లేకుండా డీలా పడిపోయిన నరేష్ కు ఈ చిత్రం మంచి బూస్ట్ అప్. ఈ చిత్రం సుమారూ 10 కోట్ల వరకూ వసూళ్లు సాధించింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన కపటధారి చిత్రం బాగున్నా ఫలితం పరంగా నిరాశ పరిచింది. ఇక క్రియేటివ్ దర్శకుడిగా, మంచి కథకుడిగా పేరున్న చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన చెక్ చిత్రం కూడా ఆశించినంతగా ఆకట్టుకోలేదు. మొదట చిత్ర టాక్ బానే ఉన్నప్పటికీ ఫలితం తారుమారైంది. మొత్తానికి ఫ్లాప్ లు బానే ఉన్నా హిట్ అయిన సినిమాలు దాన్ని కవర్ చేసాయి. ఓవర్ ఆల్ గా ఈ ఫిబ్రవరీలో వచ్చిన సినిమాలు సినీ కార్మికులకు, పంపిణీదారులకు భరోసాను ఇచ్చాయి.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.