
కొరటాల శివ ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా రిలీజ్ అవడమే ఉంది. అన్ని పనులు పూర్తి అవగా త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.. ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగానే కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ తో ప్లాన్ చేశాడు.. దీని గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది..

అందుకు సంబంధించిన అన్ని సన్నాహాలను ఆయన పూర్తిచేసుకున్నాడు. కానీ చివరి నిమిషంలో ఆయన తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తో ఉంటుందని ప్రకటించారు. ఎందువలన కొరటాల మనసు మార్చుకుని ఉంటాడు? అనే ఆసక్తి అభిమానులందరిలోను తలెత్తింది. అందుకు కారణం ఇదేనని ఇప్పుడు ఒక వార్త షికారు చేస్తోంది.

కొరటాల .. అల్లు అర్జున్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమాను చేయాలనుకున్నాడు. 'పుష్ప' సినిమా షూటింగును పూర్తి చేసి ఈ ప్రాజెక్టుపైకే అల్లు అర్జున్ రావలసి ఉంది. అయితే అదే సమయంలో 'పుష్ప' సినిమాను రెండు భాగాలుగా చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో అల్లు అర్జున్ మరికొంతకాలం అదే ప్రాజెక్టుపై ఉండవలసి వచ్చింది.