పవన్, త్రివిక్రమ్ ల పాన్ ఇండియా మూవీ..!!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.. వీటిలో ప్రేక్షకులను ఎంతో ఆసక్తి ని కలగజేస్తున్న సినిమా హరిహర వీరమల్లు.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కడం, ఈ తరహా సినిమాల్లో గతంలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ నటించకపోవడంతో ఈ సినిమా ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది..

మరోవైపు సాగర్ చంద్ర ప్రాజెక్టులతో పవన్ బిజీగా ఉన్నారు. ఆ తరువాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో చేయనున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా ఉండబోతుంది అంటున్నారు.. 'జల్సా' .. 'అత్తారింటికి దారేది' వంటి భారీ హిట్లు ఈ కాంబినేషన్లో వచ్చాయి. 'అజ్ఞాతవాసి' ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా రావాలనే అభిమానులు కోరుకుంటున్నారు.

మరో రెండేళ్లలో వాళ్ల ముచ్చట తీరనుందనే చెప్పొచ్చు. పవన్ కథానాయకుడిగా త్రివిక్రమ్ మరో ప్రాజెక్టును సెట్ చేస్తున్నట్టుగా ఒక వార్త ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రావడమనేది ఖాయమనే చెప్పుకుంటున్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.