పవన్ పవర్ కి స్టైలిష్ కోటింగ్ లేనట్టేనా..?

పవర్ స్టార్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇంతక ముందులా కాకుండా ఏడాదికో సినిమా రిలీజ్ చేసే ఆలోచలనలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత సూర్యదేవర నాగావంశి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ లు ఫీమేల్ లీడ్స్ లో నటిస్తారని టాక్. కరోన సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం షూటింగ్ ను నిలిపివేశారు.

ఈ సినిమా తర్వాతా ఆయన క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ఈ రీమేక్ తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని చిత్ర బృందం తెలిపింది. క్రిష్ సినిమా కి సంబంధించిన టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. హిస్టారిక్ మూవిగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హరిహర వీరమల్లు అనే టైటిల్ ను ఖరారు చేసారు. క్రిష్ తో సినిమా తర్వాత ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. క్రిష్ తో సినిమా తర్వాత ఆ సినిమా పట్టలెక్కచ్చు.

ఇక ఇదిలా ఉంటె రామ్ తాళ్ళూరి నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. కాని అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఆఖరికి ఈ చిత్రం ఒకటి ఉందని కూడా ప్రేక్షకులు మర్చిపోయారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ తో సినిమా చేస్త్హున్నారు. పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి సినిమా ఉంటుందో లేదో మరి వేచి చూడాలి.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.