
ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాతో ప్రేక్షకులను, విమర్శకులను అలరించిన హీరో సత్యదేవ్ తాజాగా ‘తిమ్మరుసు’ అనే కొత్త సినిమాలో నటిస్తున్నారు దీనికి "అసైన్మెంట్ వాలి" అని కాప్షన్ పెట్టారు. అంతకుముందు కళ్యాణ్ రామ్ తో 118 అనే థ్రిల్లర్ సినిమా, ఈ మధ్య కీర్తి సురేష్ తో మిస్ ఇండియా సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్ మహేష్ కోనేరు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. టాక్సివాలా ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్ గా చేస్తోంది. నటుడు బ్రహ్మాజీ, విలక్షణ నటుడు, దర్శకుడు రవిబాబు ముఖ్యమైన పాత్రాల్లో నటిస్తున్నారు. ఈ మధ్యనే హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. షూటింగ్ కి సంబదించిన ఒక వర్కింగ్ స్టిల్ బయటకు వచ్చింది. ఇందులో హీరో సత్యదేవ్, హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ పక్క పక్కన కూర్చొని ఉన్నారు. వారికి దర్శకుడు ఏదో సీన్ వివరిస్తూ ఉంటే వాళ్లు దానికి నవ్వుతూ తల ఊపుతున్నారు. ఇటు వైపు నటుడు బ్రహ్మాజీ దీనంతటినీ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. అలాగే ఇంకొక వైపు ఈ మధ్యనే ఆహా ఓ.టి.టి లో విడుదలై మంచి పేరు తెచ్చుకున్న జోహార్ అనే సినిమాలో హీరో గా నటించిన అంకిత్ కొయ్య కూడా ఉన్నారు. ఈ వర్కింగ్ స్టిల్ తో పాటు ఒక వీడియో కూడా ట్విట్టర్ లో హల్ చల్ చేస్తూ ఉంది. వీడియోలో నటుడు బ్రహ్మాజీ జస్టిస్ చౌదరీ సినిమాలోని ఫేమస్ సాంగ్ చట్టానికి న్యాయానికి సాంగ్ నీ ఎన్టీఆర్ లాగా ఇమిటేట్ చేస్తూ పాడుతూ ఉన్నారు.మధ్యలో రావిబాబు గారు వెనకాల నుండి విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ తో బ్రహ్మాజీ నీ ఆటపట్టిస్తున్నారు. ఇలా తిమ్మరుసు షూటింగ్ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో జోరుగా సాగుతోంది.