‘నేను శైలజ’ సినిమాతో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న కిషోర్ తిరుమల ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్ రూపొందిస్తున్న రెడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇక ఈ సినిమా విశేషాల గురించి దర్శకుడు కిషోర్ తిరుమల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "రెడ్ సినిమా సంక్రాంతికి అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తమిళ కథను పూర్తిగా మార్చేసి తెలుగు నేటివిటికి తగినట్టుగా కథను రూపొందించాం. ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించే విధంగా రెడ్ సినిమా ఉంటుంది" అని దర్శకుడు కిశోర్ తిరుమల తెలిపారు. తమిళంలో అరుణ్ విజయ్ నటించిన తడమ్ సినిమాకి రెడ్ తెలుగు రీమేక్ అని అందరికి తెలిసిందే. ఇక ఈ రెడ్ సినిమాలో నివేథా, మాళవిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి డిసెంబర్ 31 న విడుదలైన డించక్ సాంగ్ యూట్యూబ్ లో ట్రేండింగ్ అవుతున్నాయి.ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.అన్న తమ్ముళ్ల వైరం కథ మీద వస్తున్న ఈ సినిమా తమిళంలో లానే తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందో లేదో సంక్రాంతి వరకు ఆగాల్సిందే.
Our RED is ready to entertain all types of audiences this #Sankranthi - Director #KishoreTirumala#REDOnJan14th@ramsayz @Nivetha_Tweets @ImMalvikaSharma @Actor_Amritha #SravanthiRaviKishore #Manisharma @LahariMusic @SravanthiMovies pic.twitter.com/09EPecc7oK
— BARaju (@baraju_SuperHit) January 2, 2021