''ఒకే ఒక జీవితం'' గొప్ప చిత్రం.. మీ అందరికీ నచ్చుతుంది.. ప్రామిస్ : ''ఒకే ఒక జీవితం'' ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్!!

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రంతో తెలుగు అడుగుపెడుతోంది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలౌతుంది ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ జరిగింది. ఈ చిత్రంలోని నటీనటుల మాతృమూర్తులు ఈ వేడుకకు హాజరవ్వడం ఆకట్టుకుంది.

అమల అక్కినేని మాట్లాడుతూ.. 'ఒకే ఒక జీవితం'లో నటించడం చాలా మంచి అవకాశం. ఈ సినిమా చేయడానికి అన్ని రాష్ట్రాల నుండి కలసి వచ్చారు. కేరళ నుండి మ్యూజిక్, తమిళనాడు నుండి నిర్మాతలు, నటులు,దర్శకుడు తెలుగు అబ్బాయి,  ఐరిష్ మదర్ బెంగాల్ లో పుట్టి నన్ను తెలుగు కుటుంబంలో కోడలిగా స్వీకరించి నాకు తెలుగు నేర్పించి ఎంతగానో ఆదరించారు. ఇలా ఎంతో చక్కని టీం కలసి చేస్తున్న అద్భుతమైన చిత్రం 'ఒకే ఒక జీవితం'. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది. సెప్టెంబర్ 9 నుండి మీఫ్యామిలీ మెంబర్స్ తో కలసి థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి. మీ మనసుల్ని హత్తుకునే సినిమా ఇది. మీకు దుఃఖం వస్తే ఒక పక్షిని వదిలినట్లు వదిలేయండి. సంతోషం వస్తే వుంచుకోండి. మీకు ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం మాకుంది'' అన్నారు.

శర్వానంద్ మాట్లాడుతూ..  ఇంత అద్భుతమైన సినిమా తీసిన దర్శకుడు శ్రీకార్తిక్ కి కృతజ్ఞతలు. శ్రీకార్తిక్ పెద్ద దర్శకుడు అవుతాడు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఎస్ఆర్ ప్రభు సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. వారికి సహకారం మర్చిపోలేనిది. అమల గారు లేకుండా ఈ సినిమా ఊహించలేను. అమల గారితో కలసి నటించడం గౌరవంగా భావిస్తాను. సినిమాలో ఒక మ్యాజిక్ జరిగింది. సెప్టెంబర్ 9న ప్రేక్షకులు ఆ మ్యాజిక్ ని చూస్తారు. రీతూ వర్మ కథని నమ్మి ఈ సినిమా చేశారు. ప్రియదర్శి బ్రిలియంట్ గా ఫెర్ ఫార్మ్ చేశాడు. ఇందులో సరికొత్త వెన్నెల కిషోర్ ని చూస్తారు. ముగ్గురు పిల్లలు చాలా చక్కగా నటించారు. వారికీ హ్యాట్సప్ . జేక్స్ బిజోయ్ అద్భుమైన మ్యూజిక్ ఇచ్చారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ కృతజ్ఞతలు. ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూపిస్తున్నాం. ఇది నా ప్రామిస్. నేను మిమ్మల్ని నిరాశ పరచను. మేము అందరం నమ్మి ఒక మంచి సినిమా చేశాం. గర్వంగా చెబుతున్నా. సెప్టెంబర్ 9 అందరూ థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి'' అని కోరారు.

రీతూ వర్మ మాట్లాడుతూ..  'ఒకే ఒక జీవితం' లాంటి గొప్ప సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా వుంది. శ్రీకార్తిక్ గొప్ప దర్శకుడు. శర్వానంద్, అమల మేడమ్ గురించి ఎంత చెప్పిన తక్కువే.  'ఒకే ఒక జీవితం' అద్భుతమైన కథ. సెప్టెంబర్ 9న రిలీజ్ అవుతుంది. థియేటర్ కి వెళ్లి చూడండి. మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు.

శ్రీకార్తిక్ మాట్లాడుతూ..  తల్లి కొడుకుల ప్రయాణాన్ని విలక్షణమైన శైలిలో మనసుని హత్తుకునేలా చూపే చిత్రం 'ఒకే ఒక జీవితం'. వినోదం, మంచి పాటలు, ఎమోషన్స్, కాలంతో ప్రయాణం, గొప్ప సందేశం వున్న చిత్రమిది. ఈ కథతో అందరూ కనెక్ట్ అవుతారు. శర్వానంద్ తన నటనతో ఈ చిత్రానికి ప్రాణం పోశారు. అమల మేడమ్ గారు ఈ ప్రాజెక్ట్ లోకి రావడం నా అదృష్టం. బహుసా మా అమ్మగారి ఆశీర్వాదం వలనే ఇది సాధ్యపడింది. రీతూ వర్మ మరో అద్భుతమైన పాత్రలో మిమ్మల్ని అలరిస్తారు. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, నాజర్  పాత్రలు ఈ కథలో కీలకం. వారి అనుభవంతో కథని బలంగా తీర్చిదిద్దారు. సిరివెన్నెల లాంటి లెజండరీ రచయిత రాసిన అమ్మ పాట చిరకాలం నిలిచిపోతుంది. ఆయన ఆశీస్సులు మాపై వుంటాయి. తెలుగు లో డైలాగ్స్ రాసిన తరుణ్ భాస్కర్ గారికి కృతజ్ఞతలు. జేక్స్ బిజోయ్ అద్భుతమైన సంగీతం అందించారు. ముగ్గురు పిల్లలు చాలా చక్కగా చేశారు. మిగతా సాంకేతిక నిపుణులు, నటీనటులకు కృతజ్ఞతలు. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు ఎక్కడా రాజీ పడకుండా సినిమాని నిర్మించారు. సెప్టెంబర్ 9న ఈ సినిమా వస్తోంది. ఫ్యామిలీతో కలసి చూడండి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు.

ఎస్ఆర్ ప్రభు మాట్లాడుతూ..  'ఒకే ఒక జీవితం' గొప్ప ప్రయాణం. చాలా హార్ట్ టచ్చింగ్ మూమెంట్స్ వున్నాయి. దర్శకుడు శ్రీకార్తిక్ అద్భుతమైన కథ రాశారు. శర్వానంద్ గారు ఈ కథ ఓకే చెప్పడంతో ప్రాజెక్ట్ సైజ్ పెరిగింది. ఇందులో శర్వానంద్ నటన ఒక రోలర్ కోస్ట్ రైడర్ అనుభూతిని ఇస్తుంది. అమల గారు ఈ ప్రాజెక్ట్ చేయడం చాలా ఆనందంగా వుంది. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, రీతూ వర్మ బ్రిలియంట్ గా ఫెర్ ఫార్మ్ చేశారు. జేక్స్ బిజోయ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సినిమా కోసం పాట పాడి మాకు సపోర్ట్ చేసిన హీరో కార్తి అన్నకి కృతజ్ఞతలు. మా సినిమాలన్నిటికీ  తెలుగు ప్రేక్షకులు గొప్ప ఆదరణ ఇచ్చారు. 'ఒకే ఒక జీవితం'లో కూడా యూనిక్  కంటెంట్ వుంది. సెప్టెంబర్ 9న సినిమా థియేటర్లోకి వస్తుంది. ఫ్యామిలీతో కలసి చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను'' అన్నారు  

ప్రియదర్శి మాట్లాడుతూ.. మా అమ్మ జయమ్మ. నేను జయమ్మ కొడుకుని. నా పేరు ప్రియదర్శి. ఈ సినిమాలో అమ్మ అమల గారు. నిన్న స్క్రీనింగ్ చూసిన తర్వాత సినిమా నుండి బయటికి రాలేకపోతున్నా. ఇంత సినిమాటిక్ అనుభూతి నా జీవితంలో ఎప్పుడూ పొందలేదు.  'ఒకే ఒక జీవితం' మాస్టర్ పీస్. అమల గారి దగ్గర నుండి చాలా నేర్చుకున్నాం. శర్వానంద్, కార్తిక్. ప్రభు, కిషోర్, రీతూ ఇలా అద్భుతమైన టీం కలసి పని చేసే అవకాశం రావడం ఆనందంగా వుంది. ముగ్గురు పిల్లలు చాలా చక్కగా చేశారు. జేక్స్ బిజోయ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సినిమాకి పని చేసిన మిగతా సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు. సినిమా సెప్టెంబర్ 9 వస్తోంది. అందరూ థియేటర్లో చూడండి. మిమ్మల్ని నిరాశ పరచదు. మీకు నమ్మకం కుదరకపొతే రివ్యూస్ చదివాక థియేటర్ కి రండి'' అని కోరారు.

కృష్ణ చైనత్య మాట్లాడుతూ..  'ఒకే ఒక జీవితం'లో నిజాయితీ వుంది. హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు చాలా వస్తాయి.  గొప్ప సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. 'ఒకే ఒక జీవితం' గొప్ప సినిమా. ఇంత గొప్ప చిత్రాన్ని అందిస్తున్న దర్శక నిర్మాతలు హీరో శర్వానంద్, అమల గారికి కృతజ్ఞతలు. నేను సిగ్గు పడకుండా ఏడ్చిన సినిమా ఇది. అమల గారిని చూసినప్పుడల్లా మా అమ్మే గుర్తుకు వచ్చారు. ఎస్ఆర్ ప్రభు గారు ఉత్తమ అభిరుచి గల నిర్మాత. శర్వానంద్ ఎంతో నిజాయితీగా ఈ సినిమా చేశారు. సినిమా చాలా గొప్పగా వుంటుంది. తప్పకుండా చూడండి'' అన్నారు.

జేక్స్ బిజోయ్ మాట్లాడుతూ .. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ తో పని చేయడం ఆనందంగా వుంది. సినిమా విషయంలో వారి సలహాలు సూచనలు  చాలా విలువైనవి. నా మ్యూజిక్ టీం అందరికీ థాంక్స్. అమ్మ పాటని సిద్ శ్రీరామ్ చాలా ఆనందంగా పాడారు. మా అమ్మ నా మొదటి మ్యూజిక్ టీచర్. ఆమె లాలి పాట విని పెరిగాను. ఈ సందర్భంగా అమ్మకి కృతజ్ఞతలు. 'ఒకే ఒక జీవితం' సినిమా ఒక అద్భుతం. అందరినీ కదిలిస్తుంది. సెప్టెంబర్ 9న అందరూ థియేటర్లలో సినిమా చూడాలి' అని కోరారు.

శ్రీజిత్ సారంగ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఎడిటింగ్ ని నేను శ్రీకార్తిక్ ఒక ధ్యానంలా చేశాం. ఇప్పటికే స్పెషల్ షోలు చూసిన వారిని నుండి సినిమాని అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.  ఈ సినిమాని పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. సెప్టెంబర్ 9న సినిమా వస్తోంది. ఫ్యామిలీతో కలసి సినిమా చూడండి'' అని కోరారు

సుజిత్ సారంగ్  మాట్లాడుతూ.. ఈ చిత్రం మాకు చాలా ప్రత్యేకమైనది. శర్వానంద్, అమల గారు, వెన్నెల కిషోర్ , ప్రియదర్శి లాంటి నటులతో కలసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా శ్రీకార్తిక్ ఒక అద్భుతంలా తీశారు. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.