వీళ్ళు రిపైర్లు మొదలుపెట్టేది అప్పుడే

వరస హిట్స్ తో దూసుకుపోతున్న నందమూరి వారసుడు ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం కోసం యావత్ భారత దేశం ఎంతలా ఎదురు చూస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు వివిధ భాషలకు సంబంధించిన నటులు కూడా ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఈ మధ్యే ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి సంబంధిచిన శాటిలైట్ రైట్స్, ఓ.టి.టి రైట్స్ ఫ్యాన్సీ రేటుకి అమ్ముడైనట్లు తెలుస్తోంది.

ఇక ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఆయన చేయబోయే తదుపరి చిత్రాల గురించిన అప్డేట్ ఎప్పుడో వచ్చిన సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కొరటాల శివతో తన తదుపరి సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆర్.ఆర్.ఆర్ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. అందుచేత కొరటాలతో సినిమా కమిట్ అయ్యాడు ఎన్టీఆర్. ఇక చిత్రం ఆగస్ట్ లో సెట్స్ పైకి వెళ్లనుందని సంచారం.

ప్రస్తుతం కొరటాల శివ చేస్తున్న ఆచార్య చిత్రం పూర్తయ్యి విడుదల అయ్యి ఆయన ఫ్రీ అవడానికి ఈ గ్యాప్ సరిపోతుందని టాక్. దీన్ని బట్టి ఆచార్య చిత్రం ఆగస్ట్ లో రిలీజ్ అవుతుందని కొందరు అంటున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ కొరటాల శివ చిత్రం తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేయనున్న విషయం తెలిసిందే. కొరటాల శివతో సినిమా కంప్లీట్ అయ్యి ఎన్టీఆర్, ప్రభాస్ సలార్ కంప్లీట్ అయ్యి ప్రశాంత్ ఇద్దరూ ఫ్రీ అయ్యాక వీరి సినిమా స్టార్ట్ అవుతుంది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.