రామ్ చరణ్ నిర్మాత గా నాన్ మెగా హీరో సినిమా..!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా మారిన విషయం తెలిసిందే..  హీరోగా అయన రాజమౌళి దర్శకత్వంలో ఆర్,ఆర్,ఆర్, సినిమాలో నటిస్తుండగా ఇటీవలే శంకర్ సినిమా ను కూడా ఒకే చేశాడు. ఇకపోతే ఇప్పటివరకు రామ్ చరణ్ తన తండ్రి సినిమాలనే నిర్మిస్తూ వస్తుండగా తొలిసారి వేరే హీరో తో సినిమా నిర్మించబోతున్నాడు..

ఖైదీ నెంబర్ 150 సినిమా తో నిర్మాతగా మారి ఇప్పటివరకు మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి హిట్ లు కొట్టాడు. ఇప్పుడు రవితేజ తో ఓ రీమేక్ సినిమా ను నిర్మించబోతున్నాడట.. మలయాళంలో సూపర్ హిట్ అయినా సినిమా 'డ్రైవింగ్ లైసెన్స్' తెలుగులో రాబోతుంది.  2019లో మలయాళంలో విడుదలైన ఈ సినిమా, అక్కడ ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాదు .. వైవిధ్యభరితమైన సినిమాగా ప్రశంసలను అందుకుంది.

అలాంటి సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను చరణ్ తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ రీమేక్ లో చరణ్ చేస్తాడా? లేదంటే పవన్ చేస్తాడా? అనే విషయంపై చర్చలు బాగానే నడిచాయి. అయితే ఈ రీమేక్ లో చరణ్ గానీ .. పవన్ గాని చేయడం లేదు. మరి ఎవరు చేస్తున్నారు? అనే ప్రశ్నకి సమాధానంగా రవితేజ పేరు వినిపిస్తోంది. చరణ్ నిర్మాణంలోనే ఈ సినిమా రూపొందుతుందట. మలయాళంలో పృథ్వీరాజ్ చేసిన సినిమాలో రవితేజ కనిపించనున్నాడని అంటున్నారు. ఇక అక్కడ సూరజ్ చేసిన పాత్రకిగాను రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.