
తొలి మూడు సినిమాలు గా సరైన సక్సెస్ లు లేని అఖిల్ నాలుగో సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.. నాల్గో సినిమా ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలోని మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ విడుదలకు సిద్ధంగా ఉంది.. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు టీజర్ కు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ సినిమాపై అంచనాలు పెంచింది.. పూజ హెగ్డే కథానాయిక గా నటించిన ఈ సినిమా అఖిల్ కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి..

ఈనేపథ్యంలో అఖిల్ తన ఐదో సినిమాకి రంగం సిద్ధంచేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.. అంతేకాకుండా ఆ సినిమా కి సురేందర్ రెడ్డి ని సెట్ చేసుకుని అందరిని మరింత ఆశ్చర్య పరిచాడు.. టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి కి మంచి పేరు ఉంది.. ఈనేపథ్యంలో హిట్ లేని అఖిల్ కి సురేందర్ రెడ్డి హిట్ ఇస్తాడని నమ్మకం అక్కినేని అభిమానుల్లో నెలకొంది..

అయితే సంవత్సర కాలంగా వెయిట్ చేస్తున్న అఖిల్ సినిమా మాత్రం ఓటిటిలో ఎందుకు రిలీజ్ అవ్వట్లేదని పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. అయితే ఇటీవలే గీతాఆర్ట్స్ సంస్థ తమ సంస్థ నిర్మాణంలో తెరకెక్కిన సినిమాలు ఏవి కూడా నేరుగా ఓటిటి రిలీజ్ కావని తేల్చి చెప్పేసరికి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. థియేటర్స్ విషయం ఏమోగానీ ఈ బ్యాచిలర్ సినిమాకు ఓటిటిలో మాత్రం మంచి రేట్ వచ్చే అవకాశం ఉందట.