
భీష్మ సినిమా తో పోయిన సంవత్సరం సూపర్ హిట్ కొట్టిన నితిన్ వరుసగా రెండు ప్లాప్ లతో ఒక్కసారిగా వెనుక పడ్డట్లు అయ్యింది. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన చెక్ సినిమా రెండో రోజే డిజాస్టర్ గా మిగిలింది. నితిన్ కెరీర్ లో ఏ సినిమా కూడా ఇంతటి డిజాస్టర్ గా మిగిలలేదు.. అసలు ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నాడు నితిన్ అన్న విమర్శలు ఎదురయ్యాయి..

పోనీ ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన రంగ్ దే సినిమా కూడా భారీ ప్లాప్ గా మిగిలిపోయింది.. కొంత బాగానే ఉన్నా చివరికి ఈ సినిమా కూడా నితిన్ ఫ్లాప్ సినిమాల సరసన చేరింది.. దాంతో తర్వాత వచ్చే సినిమాలపై దృష్టి పెట్టి నితిన్ హిట్ కొట్టాలని అయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఆయన 'మాస్ట్రో' సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగు జరుపుకుంటోంది.

ఇక వచ్చే ఏడాదిలో కూడా ఆయన ఇదే జోరును కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. వక్కంతం వంశీకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్, త్వరలో ఆ సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడు. ఒక వైపున ఆ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతూ ఉండగానే, ఆయన ఓ కొత్తదర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంతవరకూ ఎడిటింగ్ చేస్తూ వచ్చిన ఎస్.ఆర్.శేఖర్, మెగాఫోన్ పట్టాలనే ఆలోచనలో ఉన్నాడట. ఆయన వినిపించిన కథకి నితిన్ ఓకే చెప్పాడని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.