నితిన్ మరో సరికొత్త ప్రయోగం.. ఫలిస్తుందా..!!

యూత్ స్టార్ నితిన్ ఇటీవలే రంగ్ దే సినిమా తో సాలిడ్ హిట్ కొట్టాడు.. బ్లాక్ బస్టర్ అని చెప్పలేం కానీ రంగ్ దే నితిన్ రేంజ్ కి మంచి హిట్ కొట్టినట్లే.. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా అతనికి హ్యాట్రిక్ దక్కగా నితిన్ కి మస్ట్ విన్ కావాల్సిన టైం లో హిట్ అయ్యింది రంగ్ దే.. అంతకుముందు చేసిన సినిమా చెక్ దారుణంగా ఫ్లాప్ అయ్యింది. దాంతో ఈ సినిమా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడగా వెంకీ అట్లూరి పై నితిన్ పెట్టుకున్న నమ్మకం ని ఒమ్ము చేయలేదు..

ఇకపోతే నితిన్ ఈ సినిమా తరవాత రెండు సినిమాలను ఒప్పుకున్నా విషయం తెలిసిందే. ఒకటి ప్రస్తుతం చేస్తున్న మ్యాస్ట్రో సినిమాకాగా మరోకటి కృష్ణ చైతన్య దర్శకత్వంలోని పవర్ పేట సినిమా.. మ్యాస్ట్రో సినిమా నితిన్ కెరీర్ లో వెరైటీ సినిమా గా రాబోతుంది. ఆ సినిమాలో నితిన్ అంధుడిగా కనిపిస్తున్నాడు.. ఇటీవలే గ్లిమ్ప్స్ కూడా వచ్చింది.. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలే ఉండగా బాలీవుడ్ అందదున్ సినిమా కి ఇది రీమేక్..

ఇక  ఆయన ఆ తరువాత మరో ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టాడు. తరువాత సినిమాగా 'పవర్ పేట' ఉండొచ్చునని అంటున్నారు. ఒకవేళ రాఘవ్ చెప్పిన కథకి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, 'పవర్ పేట' తరువాత ఉంటుందనే అనుకోవాలి. మరి నితిన్ ఓకే చెబుతాడో లేదో చూడాలి. యాత్ర తరువాత ఒక కొత్త కథను సిద్ధం చేసుకున్నాడట రాఘవ. ఇది మల్టీ స్టారర్ కథ .. ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించిన కథ అంటున్నారు. ఇద్దరూ పోలీస్ ఆఫీసర్స్ .. వాళ్ల చుట్టూనే ఈ కథ తిరుగుతుందట. రాఘవ్ ఇటీవల నితిన్ ను కలిసి కథ వినిపించినట్టుగా తెలుస్తోంది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.