
యూత్ స్టార్ నితిన్ ఇటీవలే రంగ్ దే సినిమా తో సాలిడ్ హిట్ కొట్టాడు.. బ్లాక్ బస్టర్ అని చెప్పలేం కానీ రంగ్ దే నితిన్ రేంజ్ కి మంచి హిట్ కొట్టినట్లే.. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా అతనికి హ్యాట్రిక్ దక్కగా నితిన్ కి మస్ట్ విన్ కావాల్సిన టైం లో హిట్ అయ్యింది రంగ్ దే.. అంతకుముందు చేసిన సినిమా చెక్ దారుణంగా ఫ్లాప్ అయ్యింది.

దాంతో ఈ సినిమా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడగా వెంకీ అట్లూరి పై నితిన్ పెట్టుకున్న నమ్మకం ని ఒమ్ము చేయలేదు.. ఇకపోతే అయన తన తదుపరి చిత్రంగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మ్యాస్ట్రో అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ అందదున్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమా లో నభా నటేశ్ కథానాయికగా నటిస్తుండగా, తమన్నా ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఇక బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

కాగా ఈ చిత్రం చివరి షెడ్యూల్ చేయాలని అనుకుంటూ ఉండగా కరోనా ప్రభావం పెరిగిపోయింది. దాంతో మిగతా ప్రాజెక్టుల మాదిరిగానే ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. ఇక ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ ఉండటంతో, ఈ సినిమా టీమ్ చకచకా రెడీ అయింది. చివరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ రోజున ఈ సినిమా షూటింగు మొదలైపోయింది. తరుణ్ ఆదర్శ్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.