What if you woke up to find out that there's a #Virus outbreak and you cannot step out?
— ahavideoIN (@ahavideoIN) November 30, 2020
Next up, we bring #2020's most relatable fight!
Premieres December 4.@parvatweets @talkaashiq @ttovino @rimakallingal @sreenathbhasi @Madonnaoffl @iBasil @Indrajith_S @parare pic.twitter.com/nlua7vdEFl
ప్రస్తుతం మలయాళం సినిమాల హవా నడుస్తోంది. కొత్త రకం కథ , కథనాలతో వాళ్ళ సినిమాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. అయితే మలయాళం సినిమాలని తెలుగులోకి డబ్బింగ్ చేసి ఆహా ఓటిటి తెలుగు జనాలకి అందిస్తుంది. ఇప్పటికే ఆహాలో జల్లికట్టు , ఆండ్రియాడ్ కట్టప్ప లాంటి మలయాళం సినిమాలు స్ట్రీమ్ అవుతున్నాయి.ఇక ఇప్పుడు ఆహా లోకి మలయాళం లో విడుదలై మంచి హిట్ అయిన వైరస్ సినిమాని తెలుగులోకి నీపా వైరస్ పేరుతో విడుదల చేస్తున్నారు.ఆహా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ సినిమా పోస్టర్ ని విడుదల చేసింది.
కేరళలో వైరస్ వచ్చి అందరూ చనిపోతుంటే దీనిని ప్రజలు,డాక్టర్స్ ,రాజకీయ నాయకులు ఎలా ఎదుర్కుంటారు అనేది ఈ నీపా వైరస్ కథ.ప్రస్తుతం ఉన్న కరోన పరిస్థితులకి ఈ సినిమా బాగా వర్తిస్తుంది.ఈ సినిమా ఆహా లో డిసెంబర్ 4 న స్ట్రీమ్ అవబోతుంది.ఈ సినిమాలోమలయాళంలో ప్రముఖ నటులు పార్వతి,టోవినో తమోస్ నటించారు. వైరస్ సినిమాని ఆశిక్ అబు దర్శకత్వం వహించి నిర్మించారు. 2019 లో విడుదలైన బెస్ట్ మలయాళం మూవీస్ లో ఈ సినిమా ఒకటి. మిగతా ఓటిటిల కన్నా ఆహా వరస సినిమాలని విడుదల చేస్తూ దూసుకెళ్తుంది. త్వరలో ఇతర భాషల్లో సినిమాలు కూడా ఆహా ద్వారా తెలుగులోకి విడుదల అవ్వబోతున్నాయి.