కొత్త సంవత్సరం కావడంతో సినిమా వాళ్ళు అందరూ ప్రమోషన్స్ కోసం ఈరోజును ఉపయోగించుకుంటున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ పోస్టర్స్ ను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే శర్వానంద్ తన నెక్స్ట్ సినిమా శ్రీకారంకు సంబంధించిన తాజా పోస్టర్ ను విడుదల చేసారు.
ఈ పోస్టర్ లో శర్వా లుక్ చాలా న్యాచురల్ గా ఉంది. అలాగే లేగ దూడతో శర్వానంద్ దిగిన ఫోటో భలే బాగుంది. శ్రీకారం సినిమాలో శర్వా రైతుగా కనిపిస్తాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వగా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. కిషోర్ బి అనే నూతన దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు.
14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపినాథ్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు అన్న విషయం తెల్సిందే. ఇటీవలే విడుదలైన భలేగుంది బాల కూడా సూపర్ హిట్ గా నిలిచింది. మరికొన్ని రోజుల్లో శ్రీకారం రిలీజ్ కు సంబంధించిన అధికారిక సమాచారం ఇస్తారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.