
ఈ దసరా రోజున వరుస టాలీవుడ్ క్రేజీ సినిమాల పోస్టర్లు సందడి చేస్తున్నాయి. ఈ రోజే మాస్ మహారాజ రవితేజ ‘క్రాక్’ అలాగే ఎనర్జిటిక్ స్టార్ రామ్ ‘రెడ్’ చిత్రాల పోస్టర్స్ విడుదలై తమ విడుదల తేదీని కూడా ఖరారు చేసుకున్నాయి. సంక్రాంతి 2021 కి క్రాక్ సినిమా అలాగే రామ్ రెడ్ సినిమా థియేటర్లలో హల్ చల్ చేయనున్నాయి అని చిత్ర బృందాలు వారి పోస్టర్స్ తో అధికారికంగా ప్రకటించారు. రవితేజకి బలుపు లాంటి సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన
గోపిచంద్ మలినేని క్రాక్ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే రామ్ - కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వచ్చిన నేను శైలజ , ఉన్నది ఒకటే జిందాగి సినిమాలు మంచి పేరు తెచుకున్నాయి. రెడ్ చిత్రం తమిళం లో అరుణ్ విజయ్ నటించిన ‘తడం’ అనే సినిమాకి రిమేక్. రామ్ ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు దానికి కారణం ఈ సినిమా తమిళ్ లో పెద్ద హిట్ అవడమే. అలాగే రవితేజ డైరెక్టర్ గోపిచంద్ మలినేని తీసిన హిట్ సినిమా బలుపు లాగానే క్రాక్ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది అని అందరి అంచనా. వీటితో పాటు రానా దగ్గుబాటి నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘అరణ్య’ కూడా సంక్రాంతి భరిలోనే దిగనుంది. ఈ సినిమాలు దాదాపు గా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల తేదిని ప్రకటించాయి. ఈ సినిమాలతో పాటు సంక్రాంతికి పోటీ పడే సినిమాలు తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.