
పెళ్ళి కూతురు వస్త్రాలకి ఇండియా అంత ప్రఖ్యాతి గాంచిన సబ్యసాచి డిజైన్స్ ఫ్యాషన్ రంగులో కొత్త ఒరవడి సృష్టించింది. సబ్యసాచి పెళ్ళి కూతురు డిజైన్స్ కి ఇండియాలో మంచి పేరు ఉంది. పాతకాలపు మహారాణులు వేసుకునే బట్టల మాదిరి ఘనంగా ఉంటాయి. ఈ డిజైన్స్. అయితే పెళ్ళి కూతురు డిజైన్స్ , అలాగే మగవారి కోసం కొత్త డిజైన్స్ తో ఉన్న ఒక వీడియోని సబ్యసాచి ఫాషన్స్ తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ వీడియోలో మోడల్స్ అందమైన నగలతో డిజైనర్ దుస్తులతో కనిపించారు. ఈ డిజైన్స్ రాజసాన్ని ఉట్టిపడేలా చేస్తున్నాయి. ఎరుపు రంగులో ఉండే ఈ పెళ్ళి కూతురు డిజైన్ కలెక్షన్, చూసిన వారందరినీ ఆకర్షిస్తున్నాయి. సబ్యసాచి తయారుచేసిన ఈ ఎరుపు రంగు లెహంగా డిజైన్స్ ని ఆర్డర్ చేసుకోడానికి నంబర్స్ కూడా పోస్ట్ లో ఇచ్చారు. ఈ ఫ్యాషన్ డిజైన్ కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా సబ్యసాచి డిజైన్స్ కి అసలు పోటీనే లేదు. ఫ్యాషన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యెకమైన స్థానాన్ని సబ్యసాచి ఏర్పరుచుకున్నారు. అలాగే రణబీర్ కపూర్, దీపికా పదుకొనె పెళ్ళికి కూడా సబ్యసాచి తయారుచేసిన దుస్తులని ధరించడం విశేషం. ఈ డిజైన్స్ కళాత్మకంగా అలాగే అందంగా ఉండేలా సన్యాసాచి జాగ్రత్తలు తీసుకున్నారు.