
ఒక పక్క స్టార్ హిరోల సరసన నటిస్తూ మరొ పక్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ, తెలుగు తమళ ప్రేక్షకులను అలరిస్తున్నారు నయనతార. రీసెంట్ గా సూపర్ స్టార్ రజినికాంత్ కథానాయకుడిగా వచ్చిన ‘దర్బార్’ చిత్రంలో ఆయనకు జోడిగా నటించారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరు అన్నట్టు గా నయనతార పలు వైవిధ్యమైన లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించారు. తాజాగా ఆమె అంధురాలిగా సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న తమిళ చిత్రం 'నెట్రికన్' మిలింద్‌రావ్ దర్శకుడు. ప్రముఖ దర్శకుడు విఘ్నేష్‌శివన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలు, ప్రయోగాత్మక మహిళా ఇతివృత్తాలతో కథానాయికగా వైవిధ్యతను చాటుతున్నారు నయనతార.
Happy to share you all👍
— Nayanthara✨ (@NayantharaU) October 22, 2020
Here it is the first look of #Netrikann #NetrikaanFirstLook 🎥 @VigneshShivN @DoneChannel1 @Milind_Rau pic.twitter.com/WdYmLWt6zu
గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కొత్త అవతారంలో కనిపిస్తున్న నయనతార లుక్ ఆసక్తిని పెంచుతోంది. ఇందులో తల నుంచి రక్తం కారుతున్నా లెక్కచేయకుండా చేతిలో ఆయుధాన్ని ధరించి శత్రువుపై దాడికి సిద్ధమైనట్లుగా నయనతార కనిపిస్తున్నారు. మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఓ ప్రమాదంలో కంటి చూపు కోల్పోయిన పోలీస్ అధికారిగా నయనతార నటిస్తున్నారు. ఈ సినిమాలోని తన ఫస్ట్ లుక్‌ను గురువారం ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు నయనతార. ఈ చిత్రంతో పాటు మూక్తి అమ్మన్, అన్నతే, కతువాకుల రెండు కాదల్ , నిజల్ అనే చిత్రాలలో ఆవిడ నటించారు.