నల్లమలలో నాజర్ ఏం చేయబోతున్నాడు..?

తన నటనతో హావాభావాలతో ప్రేక్షకుల మదిలో తనదైన ముద్ర వేసిన నటుడు నాజర్. ఆయన ఎటువంటి పాత్రనైన అవలీలగా పోషించగలరు. ఆ నటించిన సినిమాలను చూస్తే ఆ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. ఎన్నో పాత్రలకు తనదైన నటనతో జీవం పోసిన గొప్ప నటుడు ఆయన. కథ బాగుండి, పాత్ర బాగుంటే చిన్న సినిమా అయినా సరే ఆయన చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలా ఎన్నో చిత్రాలను, ఎన్నో పాత్రలను తన నటనతో గట్టేక్కించారు.

ప్రస్తుతం ఆయన చేస్తున్న చిత్రం ‘నల్లమల’. అటవీ ప్రాంతంలో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు రవి చరణ్. అమిత్ తివారీ, భానుశ్రీ, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్ కాలకేయ ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, ఛలాకీ చంటి, ముక్కు అవినాశ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించారు నాజర్. నల్లమల చిత్రంలో అసాధారణ మేథస్సు గల సైంటిస్ట్ గా నాజర్ కనిపించబోతున్నారు.

ఆయన పాత్ర గురించి దర్శకుడు వివరిస్తూ అతని మేధస్సు అపారమైనది. ప్రపంచాన్ని శాసించే శక్తి తన పరిశోధనలకు ఉండాలన్నది నాజర్ పాత్ర లక్ష్యం. అందుకు తానేం తయారు చేయాలి అనేది నిరంతరం ఆలోచనలు చేస్తుంటాడు. ఆ ప్రయోగం మంచిదా చెడుదా అనేది అతనికి అనవసరం. తన ప్రయోగాలకు నల్లమలను క్షేత్రంగా ఎంచుకుంటాడు నాజర్. అక్కడ అతనేం ప్రయోగాలు చేశాడు. ఏం కనుగొన్నాడు.. ఆ ప్రయోగాల ఫలితంగా ఏం జరిగింది అనేది నల్లమల చిత్రంలో ఆసక్తికరంగా ఉంటుంది. అన్నారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.