
లాక్ డౌన్ కి ముందు మొదలై కొంత షూటింగ్ జరుపుకుని ఆగిపోయిన సినిమాలు ఇప్పుడిప్పుడే మెల్లగా మొదలవుతున్నాయి. అందులో విక్టరీ వెంకటేశ్ గారు నటిస్తున్న 'నారప్ప' చిత్రం కూడా ఒకటి. తాజా షెడ్యూలుతో ఈ చిత్రం కూడా హైదరాబాదులో మొదలైంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన కొంత షూటింగు అరవై రోజుల పాటు లాక్ డౌన్ కి ముందు జరిగింది. తమిళం లో ధనుష్ కథానాయకుడి గా నటించిన 'అసురన్' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వం నిబంధనల మేరకు షూటింగులకు అనుమతి ఇవ్వడంతో నిర్మాతలు షూటింగులు ప్రారంభిస్తున్నారు. నారప్ప చిత్ర నిర్మాతలు చెబుతూ, “గతంలో అనంతపురం జిల్లా పాల్తూరు గ్రామంలో ఈ చిత్రం షూటింగును ప్రారంభించాం.
Victory Venkatesh and the entire #Narappa team has resumed shooting! We would like to send the best of wishes to our whole team! Stay safe 🙏🏼@VenkyMama @priyamani6 @SBDaggubati @theVcreations #SreekanthAddala #ManiSharma pic.twitter.com/7fInavBd1I
— Suresh Productions (@SureshProdns) November 5, 2020
ఆ తర్వాత తమిళనాడులోని కురుమలై, తెరికాడు రెడ్ డెజర్ట్ వద్ద యాక్షన్ సీన్స్ చిత్రీకరించాం. ఇప్పుడు కీలక సన్నివేశాలు, క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నాం” అని చెప్పారు. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపుగా 80% అయిపోతుంది అని నిర్మాతలు అన్నారు. ప్రస్తుతం ప్రియమణి, రావు రమేశ్, రాజీవ్ కనకాల తదితరులపై షూటింగ్ చేస్తున్నారు. హీరో వెంకటేశ్ గారు కూడా త్వరలో జాయిన్ అవుతారు. డి.సురేశ్ బాబు, కలైపులి థాను కలసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని త్వరగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం మొదట్లోనే విడుదల చేయాలని నిర్మాతల ఆలోచన. అలాగే డిసెంబర్ లో వచ్చే వెంకటేష్ గారి పుట్టిన రోజున నారప్ప టీజర్ విడుదల చేస్తారాని తెలిపారు.