
వెంకటేష్ హీరో గా నటించిన తాజా చిత్రం నారప్ప.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ సూపర్ హిట్ సినిమా అయినా అసురన్ కి కి తెలుగు రీమేక్.. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ కావడంతో తెలుగు లో ఈ సినిమా రీమేక్ కి డిమాండ్ పెరిగిపోయింది.వెంకటేశ్ భార్య పాత్రలో ప్రియమణి నటించగా, ఈ సినిమాను సురేశ్ బాబు .. కలైపులి థాను ఈ సినిమాను నిర్మించారు.

కాగా భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. అసలు ఈ పాటికే ఈ సినిమా విడుదల కావలసింది. అయితే కరోనా వలన పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో విడుదల చేయలేదు.

ఇక ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తుందనే టాక్ ఒక వైపున వినిపిస్తుంటే, లేదు థియేటర్లకే వస్తుందని మరికొంతమంది అంటున్నారు. ప్రకాశ్ రాజ్ .. సంపత్ రాజ్ .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.ధనుశ్ కెరియర్లోనే వైవిధ్యభరితమైన చిత్రంగా నిలిచిన ఈ సినిమా ఇక్కడ వెంకటేష్ కి ఎలాంటి పేరును తీసుకొస్తుందో చూడాలి.