Nani's Action Thriller 'V' on Amazon Prime

**డైరెక్ట్ టు డిజిటల్: సూపర్ స్టార్ నానీ నుంచి అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వి’ అంతర్జాతీయ ప్రీమియర్ ను ప్రకటించిన అమెజాన్ ప్రైమ్ వీడియో **

మోహన కృష్ణ ఇంద్రగంటి రచించి , దర్శకత్వం వహించిన ఈ తెలుగు థ్రిల్లర్ లో ‘నేచురల్ స్టార్’ నానీ ప్రధాన పాత్రలో నటించారు. సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైదరి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
భారత్ మరియు 200 దేశాలు, టెరిటరీస్ లలో ప్రైమ్ సభ్యులు ఎక్స్ క్లూజివ్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోపై సెప్టెంబర్ 5న విడుదలయ్యే ‘వి’ తెలుగు టైటిల్ డిజిటల్ ప్రీమియర్ ను చూడవచ్చు.
తాజా మరియు ప్రత్యేకమైన చలనచిత్రాలు, టీవీ కార్యక్రమాలు, స్టాండ్-అప్ కామెడీ, అమెజాన్ ఒరిజినల్స్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ద్వారా ప్రకటనరహిత సంగీతం, భారతదేశపు అతిపెద్ద ఉత్పత్తుల ఎంపికపై ఉచిత ఫాస్ట్ డెలివరీ, టాప్ డీల్స్ కు ప్రారంభ ప్రాప్యత, ప్రైమ్ రీడింగ్‌తో అపరిమిత పఠనం, ప్రైమ్ గేమింగ్ తో మొబైల్ గేమ్ కంటెంట్ తో ప్రైమ్ అద్భుతమైన విలువను అందిస్తుంది. అన్నీ నెలకు రూ.129 లకు మాత్రమే.
ముంబై, ఇండియా,

ఆగస్టు 20, 2020: అమెజాన్ ప్రైమ్ వీడియో నేడిక్కడ మోహన కృష్ణ ఇంద్రగంటి రచించి , దర్శకత్వం వహించిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ ‘వి’ అంతర్జాతీయ ప్రీమియర్ ను ప్రకటించింది. ఈ తెలుగు థ్రిల్లర్ లో ‘నేచురల్ స్టార్’ నానీ ప్రధాన పాత్రలో నటించారు. సుధీర్ బాబు, నివేత థామస్, అదితి రావు హైదరి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. భారత్ మరియు 200 దేశాలు, టెరిటరీస్ లలో ప్రైమ్ సభ్యులు ఎక్స్ క్లూజివ్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోపై సెప్టెంబర్ 5న విడుదలయ్యే ‘వి’ తెలుగు సినిమా డిజిటల్ ప్రీమియర్ ను చూడవచ్చు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, ‘‘యాక్షన్ థ్రిల్లర్స్ ను నేను ఎంతగానో ఇష్టపడుతాను. అలాంటి థ్రిల్లర్స్ లో ఒకటి ‘‘వి’’. ఇది థ్రిల్ ను, నాటకీయతను, వేగవంతమైన యాక్షన్ ను అందిస్తుంది. సుధీర్ బాబు, నేను నటిం చిన పాత్రల మధ్య జరిగే ఎలుకా- పిల్లి ఆట నేను ఈ సబ్జెక్ట్ పై దృష్టి పెట్టేలా చేసింది. ‘వి’ అంతర్జాతీయ ప్రీమి యర్ పై నేనెంతో ఉద్వేగంగా ఉన్నాను. సినీ పరిశ్రమలో ఇది నా 25వ సినిమా.200 దేశాలు, టెరిటరీస్ లలో‘వి’ ని ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రైమ్ వీడియోలో చూసే అవకాశం నా అభిమానులకు, మద్దతుదారులకు కలిగింది. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకునేందుకు ఇంతకు మించిన మార్గం మరొకటి లేదు. ఓ ఆసక్తిదాయక అం శం ఏమిటంటే... నా మొదటి సినిమా విడుదల అయిన రోజే....అంతర్జాతీయంగా ఈ సినిమా ప్రదర్శన జరుగ నుంది...అదే సెప్టెంబర్ 5’’ అని అన్నారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్, కంటెంట్ హెడ్ విజయ్ సుబ్రమణియం మాట్లాడుతూ, ‘‘వివిధ భాష ల్లో, రకాల్లో తాజా వినోదాన్ని అందించడం మరియు అత్యుత్తమ ప్రతిభావంతులతో కలసి పని చేయడంలో మేం ముందుకు సాగుతున్నాం. తెలుగు సినిమా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందించింది. అవి ప్రేక్షకులకు వినో దాన్ని అందించడం మాత్రమే గాకుండా ఎంతో ముఖ్యమైన సామాజిక సందేశాలను సైతం అందించాయి. మా సే వలకు సంబంధించి తెలుగు కంటెంట్ మరియు తెలుగు వీక్షకులు ఎంతో ముఖ్యమైనవి. యాక్షన్ తో నిండిన, వి జువల్లీ స్టన్నింగ్ ఎంటర్ టెయినర్ అయిన ‘వి’ని మా ప్రేక్షకులకు అందించడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. తెలుగు సినీ ప్రముఖుల్లో నాని ఒకరు. ఆయన తాజా సినిమా ‘వి’ని అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా అంతర్జా తీయంగా ప్రదర్శించడం మాకెంతో ఆనందదాయకం’’ అని అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, ‘‘జాను, ఎఫ్ 2, ఎంసీఏ, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి చిత్రాలకు అపూర్వ స్పందన పొం దాం. ఇవన్నీ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. భారత్ లో మాత్రమే కాదు, విదేశాల్లో సైతం వినియోగదారులకు మా కంటెంట్ ను వినియోగదారులకు అందించడంలో ప్రైమ్ వీడియో గొప్ప భాగస్వామిగా ఉంటోంది. భాషాపరమైన, భౌగోళికపరమైన హద్దులను అధిగమించడంలో వారు తోడ్పడ్డారు. కంటెంట్ ను చూసి ఆనందించడంలో స్టోరీ టెల్లింగ్ కీలకపాత్ర పోషిస్తోంది. ‘వి’ గ్లోబల్ ప్రీమియర్ తో మా అనుబంధాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లడం మాకెంతో ఆనందదాయకం. ఇది యాక్షన్ తో నిండిన థ్రిల్లర్. నాని ఇందులో ప్రధానపాత్ర పోషించారు. సుధీర్ బాబు ,నివేదా థామస్, అదితి రావు హైదరి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.

కథా సారాంశం:

క్రైమ్ రచయిత్రితో ప్రేమలో పడిన ఓ పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ ‘వి’. సాల్వ్ చేయాల్సిందిగా ఓ పజిల్ ఇస్తూ ఓ హంత కుడు చేసే సవాళ్లతో ...ప్రశాంతంగా సాగుతున్న ఆ పోలీస్ జీవితం కాస్తా తలకిందులవుతుంది. దిల్ రాజు, శిరీ ష్, హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మోహన కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అమి త్ త్రివేది సంగీతం అందించారు. నేచురల్ స్టార్ నాని, నివేదా థామస్, సుధీర్ బాబు, అదితి రావు హైదరి ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నటించారు.

ప్రైమ్ వీడియో కేటలాగ్ లోని వేలాది టీవీ షోలు, హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల జాబితాలోకి ‘వి’ చిత్రం కూడా చే రనున్నాయి. ఇందులో గులాబో సితాబో, శకుంతలా దేవి, పొన్ మగల వందల్, ఫ్రెంచ్ బిర్యానీ, లా, సూఫియమ్ సుజాతాయు మ్, పెంగ్విన్ వంటి భారతీయ సినిమాలు, బాండిష్ బాండిట్స్, బ్రీత్ ఇన్ టు ది షాడోస్, పాతాళ్ లోక్, ది ఫర్గాటన్ ఆర్మీ - ఆజాది కే లియే, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీజన్ 1 మరియు 2, ది ఫ్యా మిలీ మ్యాన్, మీర్జాపూర్, ఇన్ సైడ్ ఎడ్జ్, మేడ్ ఇన్ హెవెన్ వంటి భారతీయ నిర్మిత అమెజాన్ ఒరిజినల్ సి రీస్, టామ్ క్లాన్సీస్ జాక్ రయాన్, ది బాయ్స్, హంటర్స్, ఫ్లియాబ్యాగ్, ది మార్వలెస్ మిసెస్ మైసెల్ వంటి అ వార్డ్ విన్నింగ్, ఎంతగానో ప్రశంసలు పొందిన గ్లోబల్ అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే ఇవన్నీ లభ్యమవుతాయి. హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, పంజాబీ, బెంగాలీ భాషలలో టైటిల్స్ ను కూడా ఈ సర్వీస్ లో పొందవచ్చు.

ప్రైమ్ సభ్యులు ప్రైమ్ వీడియో యాప్ ద్వారా అన్ని టైటిల్స్ ని స్మార్ట్ టీవీలు, మొబైల్ ఉపకరణాలు, ఫైర్ టీవీ, ఫైర్ టీవీ స్టిక్, ఫైర్ టాబ్లెట్స్, యాపిల్ టీవీ వంటి వాటిపై ఎప్పుడైనా, ఎక్కడైనా చూడవచ్చు. ప్రైమ్ వీడియో యాప్ లో ప్రైమ్ సభ్యులు ఎపిసోడ్స్ ను తమ మొబైల్ ఉపకరణాల్లోకి, టాబ్లెట్స్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే ఆఫ్ లైన్ లో ఎక్కడైనా చూసుకోవచ్చు.
భారతదేశంలో ప్రైమ్ సభ్యులకు ప్రైమ్ వీడియో సంవత్సరానికి రూ.999 లేదా నెలకు రూ. 129 లకు లభ్యమవు తుంది. నూతన కస్టమర్లు www.amazon.in/ prime లో మరిన్ని వివరాలు పొందవచ్చు. ఉచిత 30 రోజుల ట్రయల్ కోసం సబ్ స్ర్కైబ్ చేయవచ్చు.

అమెజాన్ ప్రైమ్ వీడియో గురించి:
ప్రైమ్ వీడియో అనేది ఒక ప్రీమియం స్ట్రీమింగ్ సర్వీస్. ఇది ప్రైమ్ సభ్యులకు అవార్డ్ విన్నింగ్ అమెజాన్ ఒరిజినల్ సిరీస్ కలెక్షన్, వేలాది సినిమాలు, టీవీ షోలు – తాము కోరుకున్నవన్నీ ఒకే చోట లభించేలా చేస్తుంది. Prime Video.com లో మరింత సమాచారం తెలుసుకోండి.
• ప్రైమ్ వీడియోతో భాగం: ప్రైమ్ వీడియో కేటలాగ్ లోని వేలాది టీవీ షోలు మరియు హాలీవుడ్ మరి యు బాలీవుడ్ చిత్రాల జాబితాలోకి ‘వి’ కూడా చేరింది. ఇందులో బాండిష్ బాండిట్స్, బ్రీత్: ఇన్ టు ది షా డోస్, పాతాళ్ లోక్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్, ది ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, ఇన్ సైడ్ ఎడ్జ్ మరియు మేడ్ ఇన్ హెవెన్ వంటి భారతీయ నిర్మిత అమెజాన్ ఒరిజినల్ సిరీస్, టామ్ క్లాన్సీస్ జాక్ రయాన్, ది బాయ్స్, హంటర్స్, ఫ్లియాబ్యాగ్, ది మార్వలెస్ మిసెస్ మైసెల్ వంటి అవార్డ్ విన్నింగ్ మరియు ఎంత గానో ప్రశంసలు పొందిన గ్లోబల్ అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైమ్ వీడియోలో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే ఇవి లభ్యమవుతాయి. ఈ సేవలో హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, పంజాబీ, బెంగాలీ భాషలలో టైటిల్స్ పొందవచ్చు
• తక్షణ యాక్సెస్: ప్రైమ్ సభ్యులు ప్రైమ్ వీడియో యాప్ ద్వారా స్మార్ట్ టీవీలు, మొబైల్ ఉపకరణాలు, ఫైర్ టీవీ, ఫైర్ టీవీ స్టిక్, ఫైర్ టాబ్లెట్స్, యాపిల్ టీవీ మరియు పలు రకాల గేమింగ్ ఉపకరణాలు వంటి వా టిపై ఎప్పుడైనా, ఎక్కడైనా చూడవచ్చు. ఎయిర్ టెల్ మరియు వోడాఫోన్ ప్రి-పెయిడ్ మరియు పోస్ట్ పె యిడ్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ ద్వారా కూడా వినియోగదారులు ప్రైమ్ వీడియోను పొందవచ్చు. ప్రైమ్ వీడి యో యాప్ లో ప్రైమ్ సభ్యులు ఎపిసోడ్స్ ను తమ మొబైల్ ఉపకరణాల్లోకి, టాబ్లెట్స్ లోకి డౌన్ లోడ్ చే సుకోవచ్చు. ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే ఆఫ్ లైన్ లో ఎక్కడైనా చూసుకోవచ్చు.
• మెరుగుపర్చబడిన అనుభూతులు: ప్రతీ వీక్షణాన్ని మరింతగా అనుభూతి చెందండి 4కె అల్ట్రా హెచ్ డి మరియు హై డైనమిక్ రేంజ్ (హెచ్ డిఆర్) కంపాటిబుల్ కంటెంట్ తో. ఎక్స్ క్లూజివ్ ఎక్స్ -రే యాక్సెస్ తో మీ అభిమాన సినిమాలు, టీవీ షోల గురించి మరింతగా ఆనందించండి. ఐఎండీబీచే శక్తివంతం. ఆఫ్ లైన్ లో తరువాత చూసుకునేందుకు వీలుగా సెలెక్ట్ మొబైల్ డౌన్ లోడ్స్ తో సేవ్ చేసుకోండి.
• ప్రైమ్ తో చేరిక: భారతదేశంలో ప్రైమ్ సభ్యులకు ప్రైమ్ వీడియో సంవత్సరానికి రూ.999 లేదా నెలకు రూ. 129 లకు లభ్యమవుతుంది. నూతన కస్టమర్లు www.amazon.in/prime లో మరిన్ని వివరాలు పొందవచ్చు మరియు ఉచిత 30 రోజుల ట్రయల్ కోసం సబ్ స్ర్కైబ్ చేయవచ్చు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.