
న్యాచురల్ స్టార్ నాని నటించిన 25వ చిత్రం వి ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెల్సిందే. నాని నెగటివ్ రోల్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు తన 26వ సినిమాపై ఫోకస్ పెట్టారు నాని. ఆయనతో ‘నిన్ను కోరి’ చిత్రం తెరకెక్కించిన శివ నిర్వాణ దర్శకత్వంలో నాని తన 26వ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.’ టక్ జగదీష్’ టైటిల్ తో ఈ సినిమా చిత్రీకరణ లాక్ డౌన్ కు ముందే మొదలైంది. అయితే కరోనా కారణంగా నిలిచిపోయింది. ఇక నిన్న రాత్రి నుండి టక్ జగదీష్ షూట్ తిరిగి మొదలైంది. ఈ విసహయామై నాని ట్విటర్ వేదికగా "జగదీష్ జోయిన్స్, టక్ బిగిన్స్" అని ట్వీట్ చేసారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలైనట్లు తెలుస్తోంది. రీతూ వర్మ,, ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రైమ్ స్టార్ జగపతి బాబు గారు నానికి అన్న పాత్రలో కనిపించనున్నారు.
Jagadish joins
— Nani (@NameisNani) October 7, 2020
Tuck begins 🎥 #TuckJagadish pic.twitter.com/3QezrZsNfH