
నాచురల్ స్టార్ నాని ఒకే సమయంలో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు.. టక్ జగదీష్ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉండగా, శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.. శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ తెరకెక్కగా తొలి రెండు సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన శివ నిర్వాణ ఈ సినిమాతో హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు..

ఇక టాక్సీవాలా చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాహుల్ సాంకృత్యాయన్ శ్యామ్ సింగ రాయ్ చిత్రానికి దర్శకుడు.. సాయి పల్లవి కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను ఇటీవలే విడుదల కాగా ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది.. ఇకపోతే నాని అంటే సుందరానికి సినిమా కి వివేక్ ఆత్రేయ దర్శకత్వం కాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్ గా పరిచయం అవుతోంది నజ్రియా..

అయితే ఇవే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంతవరకు తెరకెక్కని గేమ్ నేపథ్యంలో నాని మరో సినిమా రాబోతుందని సమాచారం.తెలుగులో ఇప్పటివరకు క్రికెట్ - కబడ్డీ - బాక్సింగ్ నేపథ్యంలో ఎక్కువ సినిమాకు వచ్చాయి. అలాగే ఇటీవలే హాకీ నేపథ్యంలో కూడా ఓ సినిమా వచ్చింది. అయితే తాజాగా మరో క్రీడా నేపథ్యం కలిగిన సినిమాకు నేచురల్ స్టార్ నాని ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు నాని పాతిక సినిమాలు చేసాడు. అందులో కబడ్డీ - క్రికెట్ నేపథ్యంలో సినిమాలు చేసేసాడు. కానీ ఇప్పుడు త్వరలోనే నాని ఫుట్ బాల్ నేపథ్యంలో సినిమా చేయనున్నట్లు టాక్.