నందమూరి బాలకృష్ణ

పరిచయం

తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసి, తెలుగు చిత్రసీమలో ఎన్నో విజయాలతో ఎన్నెన్నో రికార్డ్లను నెలకొల్పి, ఎందారో అభిమానులను సంపాదించుకుని తనకు తానె సాటి అని అనిపించుకునే నట రత్న, పరిచయం అవసరం లేని నందమూరి వారసుడు, నందమూరి బాలకృష్ణ.

జననం

స్వర్గీయ నందమూరి తారక రామారావు, బాసవతరకమ్మ ల దంపతులకు ఆరవ సంతానంగా జూన్ 10,1960 సంవత్సరంలో, మద్రాసు( ఇప్పటి చెన్నై) లో  జన్మించారు. తన తండ్రి రూపంతో పాటు అభినాయాన్ని కూడా పునికిపుచ్చుకున్నారు ఈ నటసింహం.

బాల్యం – విద్యాభ్యాసం

సిల్వర్ స్పూన్తోనే పుట్టినా ఎప్పుడు నాన్న గారు క్రమశిక్షణ తప్పనిచ్చె వారు కాదు అంటూ తన మాటల్లోనే చెప్పుకుంటారు బాలయ్య. వొళ్ళోకూర్చోపెట్టుకొని రామాయణ, మహాభారతాలు చెప్పినా, షూటింగ్ కి తీసుకెళ్ళి అంతా గమనించమని సలహా ఇచ్చినా అది నాన్న గారెకే చెల్లు. ఆయన లాంటి ఆంకితభావం, క్రమశిక్షణ నేను నా జీవితంలో ఏవరి లోనూ ఛుడలేదుఅంటారాయన.తన సుగుణాలు అన్నీ మాతృ పితృ సుకృతాలేనని ఎవరికైన తల్లి నుండి శుచి శుభ్రత, భావుకత  తండ్రి నుండిసంస్కారం, ధర్మాధర్మ విచక్షణ, పరిపాలన దక్షత ఆలవాడతాయంటారు. బాలకృష్ణ బాల్యమంతా మద్రాస్ లోనే సాగింది. అక్కడే ఆయన ప్రాధమిక విద్యను అభ్యసించారు. ఆ తర్వాత సినీ పరిశ్రమ హైదరాబాదుకు మారిన పిమ్మట ఆయన హైదరాబాద్ నిజాం కాలేజి నుండి కామర్స్ లో డిగ్రీ పట్టా పొందారు.

వ్యక్తిగత జీవితం

మనసా వాచా కర్మణా తాను నమ్మిందే చేస్తానని చెప్పుకునే బాలయ్య, మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఏ విషయమైన కుండ బద్దలయ్యేట్లు మాట్లాడటం ఆయన స్పెషాలిటీ. స్వర్గీయ తారక రామారావు గారి కీర్తి ప్రతి ప్రతిష్ఠల వారసత్వం తన పూర్వ జన్మ సుకృతమని అంటారాయన. కేవలం నటనే గాక గుర్రపు స్వారీ, కత్తిసాము లాంటి విద్యాలలో కూడా మేటి. 1982 వ సంవత్సరంలో వసుంధర దేవి గారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. బ్రాహ్మణి, తేజస్విని, మోక్షజ్ఞ వారి పేర్లు.

సినీరంగ ప్రవేశం

సహజంగానేచిన్నప్పటనుండి నటన పట్ల ఆసక్తి ఉన్నా, ఒక వయసు వచ్చే వరకు వేచిఉండాలని 14 వ ఏటా  తమ స్వంత బ్యానర్ ఆయిన“రామకృష్ణ సినీ స్టూడియో“లో ఎన్టీ రామారావు  గారి దర్శకత్వం లో వచ్చిన  “తాతమ్మ కల” అనే సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యారు. దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీం ఆనార్కలి , శ్రీమద్వీరట పర్వం , శ్రీ వేంకటేశ్వర కళ్యాణం లాంటి అనేక చిత్రాలలో బాల నటుడిగా, సహాయ నటుడిగా  నటించారు.విశేషం ఏంటంటే అన్నీ సీనియర్ ఎన్.టి.ఆర్ గారే దర్శకత్వం వహించారు. కథానాయకుడిగా తన మొదటి చిత్రం మాత్రం “సాహసమే జీవితం” గజలక్ష్మి కంబైన్ బ్యానర్ పై పి.వాసు, శాంతన భారతిల ఉమ్మడి దర్శకత్వంలో 1984 జూన్,1న  విడుదలయ్యింది. ఒక మధ్యతరగతి కుర్రాడు, ఒక మల్టీ మిలీనీయర్కూతుర్ని ప్రేమించి తన తెలివితో తెగువతో తన ప్రేమ ని ఎలా గెలుచుకున్నాడు అనేది స్తులంగా కధ.  మిడిల్ క్లాస్ లెక్చరర్ కొడుకు రవి గా పాత్రలో వొదిగిపోయారుబాలయ్య. తండ్రి కి తగ్గ తనయుడుగా  మంచి భవిష్యత్తు ఉంటున్దనిపించుకున్నారు.

విలక్షణ నటుడిగా

నటనంటే కేవలం నవ్వటం, ఏడవటం, దర్శకులు చెప్పిన డైలాగులు వల్లించడం కాదని,మరొక పాత్ర లోకి పరకాయ ప్రవేశం చేసి మెప్పిచడం, మనం నిజ జీవితంలో అనుభవించ లేనివి ఎన్నో అనుభావాలని, అనుభూతులని పాత్రల ద్వారా అభినయించి చూపించడం. ఈ విషయంలో బాలకృష్ణ గారు తన తండ్రి గారి పూర్తి పంధ ని అనుసరిస్తున్నారనే చెప్పాలి. అటు పౌరాణికాల నుండి ఇటు సాంఘిక చిత్రాలు అన్నిట్లోనూ  తన మార్కు నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు బాలయ్య. అందులో కొన్ని విలక్షణ చిత్రాలు

  1. ఆదిత్య 369
  2. భైరవ ద్వీపం
  3. సమర సింహా రెడ్డి
  4. శ్రీ రామ రాజ్యం
  5. సింహా
  6. గౌతమి పుత్ర షాతకర్ణి

ఆదిత్య 369

అప్పట్లో ఈ చిత్రం ఒక పెద్ద సంచాలనమనే చెప్పాలి. ప్రముఖ గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఒకసారి నిర్మాత శివలెంకకృష్ణప్రసాద్ తో మాట్లాడుతూ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దగ్గరున్న టైం ట్రావెల్ (కాలంలో ప్రయాణం) గురించిన కథ చెప్పాడు. అది విన్నకృష్ణప్రసాద్ వెంటనే ఆయనతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. కృష్ణదేవరాయల కాలం అనగానే ఆయనకు కథానాయకుడు బాలకృష్ణ గుర్తొచ్చాడు. బాలకృష్ణకు వెళ్ళి ఈ విషయం చెప్పగానే ఆయన కూడా ఇందులో నటించడానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమా చిత్రీకరణకు 110 రోజులు పట్టింది. మొదట్లో ఈ సినిమాకు పి. సి. శ్రీరాం ఛాయాగ్రాహకుడు. ఆయనకు అత్యవసరంగా శస్త్రచికిత్స జరపవలసి రావడంతో ఆయన బాధ్యతను వి. ఎస్. ఆర్. స్వామి, కబీల్ లాల్ కి అప్పగించారు.మన తెలుగులో సైన్స్ ఫిక్షన్ సినిమాలకి ఒక ఆద్యం పోసింది. కంప్యూటరు గ్రాఫిక్స్ కూడా అందుబాటులో లో లేని దశలో ఇంత అధ్బుతంగా చిత్రించడమంటే మాటలు కాదు. గొప్ప ఇమాజినేషన్, విజన్ ఉంటే తప్ప సాధ్యం కాదు.ఆగస్ట్ 18, 1991 న విడుదలయిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసల తో పాటు , కమర్షియల్ కూడా పెద్ద విజయాన్నే అందుకుంది.

తెలుగు సినిమా ప్రేక్షకులకు అంతగా అలవాటు లేని ఈ విధమైన క్లిష్టత తో కూడు కున్న కథను తెరకెక్కించి ప్రేక్షకుల ఆదరణ పొందడంలో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రతిభ కనిపిస్తుంది. జంధ్యాల మాటలు, వేటూరి పాటలు, ఇళయరాజా సంగీతం, శ్రీరామ్, స్వామిల ఫొటోగ్రఫీ ఈ చిత్ర విజయానికి బాగా దోహదం చేశాయి. విజయనగర రాజ్యంకాలంలో కృష్ణమోహన్ అనే (తరువాతి కాలంనుండి వచ్చిన) యువకునిగానూ, కృష్ణదేవరాయలుగానూ కూడా బాలకృష్ణ అబ్ధుతంగానటించారు .

భైరవ ద్వీపం

బాల కృష్ణ గారి లోని ఒక పొటెన్షియల్ నటుడిని ఇందులో చూడవచ్చు. ఒక కురూపి పాత్రలో ఆన్ని భావావేశాలు పలికించడామంటే మాటలు కాదు.కథ విషయానికి వస్తే చంద్రప్రభ వంశానికి చెందిన జయచంద్ర మహారాజు వసుంధర అనే ఆమెను గర్భవతిగా చేసి వదిలేస్తాడు. వసుంధర ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ ఓ తుఫాను కారణంగా ఆమె ఆ బిడ్డను కోల్పోతుంది. ఆమె నీటిలో కొట్టుకుని పోగా జమదగ్ని మహర్షి అనే ఆశ్రమంలో ఆశ్రయం పొందుతుంది. ఆమెకు తెలివి రాగానే బిడ్డను కోల్పోయానని తెలుసుకుని తాను కూడా ఆత్మార్పణకు సిద్ధ పడుతుంది. అది చూసిన జమదగ్ని మహర్షి ఒక పుష్పాన్ని సృష్టించి అది వాడిపోకుండా ఉన్నంత వరకు ఆమె కుమారుడు క్షేమంగా ఉంటాడని చెబుతాడు. దాంతో ఆమె సాంత్వన పొందుతుంది. తుఫాను లో తప్పిపోయిన బిడ్డ ఒక గిరిజన గూడానికి చేరతాడు. వారి నాయకుడు ఆ బిడ్డని కన్నకొడుకులా పెంచుతారు. ఆ బాబుకు విజయ్ అనే పేరు పెట్టుకుని ఒక వీరుడిలా తీర్చిదిద్దుతారు. కొన్నాళ్ళకు విజయ్ తన స్నేహితుడు కొండన్నతో కలిసి జలపాతం దగ్గరికి వెళ్ళి అక్కడ బ్రహ్మానంద భూపతి కూతురైన పద్మావతిని చూస్తారు.

విజయ్ ఆమెను తొలిచూపులోనే అభిమానించడం మొదలుపెడతాడు. మరల ఒకసారి కూడా అంతఃపురంలోకి చొచ్చుకుని వెళ్ళి ఆమెతో మాట్లాడివస్తాడు. అతని ధైర్యసాహసాలకు మెచ్చి పద్మావతి కూడా అతన్ని ప్రేమించడం మొదలుపెడుతుంది. విజయ్ తన తల్లికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని ఏ విధంగా తన ప్రేమని, రాజ్యాన్ని గెలుచుకున్నాడు అన్నదే కథాంశం. కథ విన్న వెంటనే తన తండ్రి నటించిన పాతాళ భైరవి లాంటి చిత్రం లాగా కథ, కథనం అనిపించడంతో వెంటనే ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నాడు. కథా నాయికగా అప్పట్లో జోరుగా ఉన్న రోజాను తీసుకున్నారు. బాలకృష్ణ తల్లిగా కె. ఆర్. విజయ, తండ్రిగా విజయకుమార్, పెంపుడు తల్లిదండ్రులుగా రాధాకుమారి, భీమేశ్వరరావు, తమ్ముడిగా బాబు మోహన్, గురువుగా మిక్కిలినేని, యక్షిణిగా రంభను ఎంపిక చేసుకున్నారు. పద్మనాభం, సుత్తివేలు అతిథి పాత్రలకు ఎంపికయ్యారు. గిరిబాబు, శుభలేఖ సుధాకర్ హాస్యప్రధానమైన పాత్రలకు అనుకున్నారు. మరుగుజ్జు మనుష్యులుగా మాస్టర్ విశ్వేశ్వరరావు, చిట్టిబాబును అనుకున్నారు.

అయితే భేతాళ మాంత్రికుడు పాత్రకు ఎస్. వి. రంగారావు లాంటి వారు అయితే బాగుండునని హిందీ నటులైన నానా పటేకర్, అమ్రిష్ పురి పేరును పరిశీలించారు. నిర్మాత వెంకట్రామిరెడ్డి వియత్నం కాలనీ  అనే మలయాళ సినిమా మద్రాసులో చూసి అందులో రాజకుమార్ అనే తెలుగు నటుడు ఈ పాత్రకు సరిపోగలడని అనిపించింది. ఆయనకు విజయ సంస్థ పేరు, రంగారావు పేరులోను రంగా ను, అసలు పేరు రాజాను కలిపి విజయ రంగరాజా అనే పేరుతో ప్రతినాయకుడిగా తమ సినిమాలో పరిచయం చేశారు నిర్మాతలు. ఈ సినిమా సింగీతం గారి కి ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని, అందివ్వాడమే గాక ఆ సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా కూడా మరో ఆవార్డు అందుకుంది.

సమర సింహా రెడ్డి

బాలయ్య  బాబు నటుడిగా మరో మెట్టు ఎక్కిన చిత్రం  సమర సింహా రెడ్డి. బి గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ,సిమ్రాన్ అంజల జవేరి , జయప్రకాష్ రెడ్డి  ప్రధాన పాత్రల్లో నటించిన 1999 నాటి ఫ్యాక్షన్ సినిమా.

కథ : సినిమాకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ తాను సిందూరపువ్వు అనే తమిళ సినిమా నుంచి సమరసింహారెడ్డి ప్రధాన ఇతివృత్తాన్ని స్వీకరించానని తెలిపారు. సింధూర పువ్వు కథలో ఒకావిడ తన కూతుర్ని బాగా చూసుకుని, సవతి పిల్లల్ని బాగా చూడదు. అది నచ్చని ఆవిడ సవతి కొడుకు, తన చెల్లెల్ని వదిలేసి పారిపోయి ఓ కథానాయకుడి (విజయకాంత్) దగ్గర డ్రైవర్ గా చేరతాడు. కథానాయకుడు పెద్ద డాన్, అతనిపై ప్రత్యర్థులు దాడి చేసినప్పుడు కాపాడేందుకు డ్రైవర్ చనిపోతాడు. అతని వెనుక ఉన్న కథను తెలుసుకున్న కథానాయకుడు, అతని కుటుంబంలోకి అతని పేరుమీదే వెళ్ళి వాళ్ళని కష్టాల నుంచి బయటపడేస్తాడు.ఈ ప్రధానమైన ఇతివృత్తాన్ని స్వీకరించి చనిపోయిన పనివాడు కథానాయకుడి చేతిలోనేపొరబాటున చనిపోవడం, కథను ఫ్లాష్ బాక్ విధానంలో చెప్పడం వంటి మార్పులు చేర్పులు చేశారు.

సమరసింహారెడ్డిసినిమాలో రాయలసీమ ముఠాకక్షలు (ఫ్యాక్షనిజం) నేపథ్యంగా తీసుకున్నారు. ఆపైన రాయలసీమ ముఠాకక్షల నేపథ్యం దశాబ్దానికి పైగా తెలుగు సినిమాలను విపరీతంగా ప్రభావితం చేసింది. ఐతే ఈ సినిమాను మొదట కథారచయిత విజయేంద్రప్రసాద్ బొంబాయి మాఫియా నేపథ్యంలో రాద్దామని భావించారు. కానీ అప్పటికి విజయేంద్రప్రసాద్ కి సహాయకునిగా పనిచేస్తున్న రత్నం సలహా మేరకు రాయలసీమ ఫాక్షన్ ని నేపథ్యంగా చేసుకున్నారు. ఒకసారి విజయవాడ రైల్వేస్టేషన్లో స్థానికంగా బలం ఉండి, గ్రూపు కక్షలు ఉన్న దేవినేని, వంగవీటి కుటుంబాల వారు ఒకేసారి రైలు దిగే పరిస్థితి ఏర్పడింది. దాంతో వారి కోసం వచ్చిన ఇరువర్గాల ఎదురుపడి ఉద్రిక్తత నెలకొనడం, దానివల్ల పోలీసుల్లో టెన్షన్ కలగడం ఈ సినిమాకి రచనా సహకారం చేసిన రత్నం నిజజీవితంలో స్వయంగా చూశారు. ఆ సంఘటన స్ఫూర్తిగా సినిమాలో ప్రధానమైన రెండు వర్గాల మధ్య రైల్వేస్టేషన్లో ఉద్రిక్తతలు ఏర్పడడం, ఘర్షణ కలగడం వంటి సన్నివేశాలు రాసుకున్నారు.

ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్ద విజయాన్ని చోటు చేసుకొని అఅప్పటి వరకు ఉన్న అన్నీ వసూళ్ల రికార్డులను  బద్దలు చేస్తూ, తెలుగులో ఫాక్షన్ నేపధ్య సినిమాలకు ఒక అంకురార్పణ చేసిందనే చెప్పాలి.

సింహా

విజయవంతమైన లక్ష్మీ నరసింహ” తర్వాత వరుసగా ఏడు చిత్రాలు పారాజయంగా నిలిచాయి. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ ఆంచానాలతో విడుదలై రేకార్డు విజయాన్ని సొంతం చేసుకుంది.

కధ :నలుగురికి మంచి చేయటానికి ఆయుధం పట్టిన వైద్యుని పాత్రలో నందమూరి బాలకృష్ణ నటించాడు. ఈ నటన తెలుగు సిని చరిత్రలో ఇప్పటి వరకు ఏ నటుడు ప్రదర్శించని రౌద్ర రసం వెండి తెర పై తెలుగు వారు చూడగలిగారు. డాక్టర్ నరసింహగా చూపిన భావోద్వేగాలు నభూతోనభవిష్యత్. ఆరు సంవత్సరాల కరువును క్షణకాలంలో తీర్చిన చిత్రమాలిక.

గౌతమి పుత్ర షాతకర్ణి

మా జైత్రయాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి, మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయము లేదు మిత్రమా శరణమా.. రణమా అంటూ బాలకృష్ణ తనదైన శైలి డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

జాగర్లమూడి రాధ కృష్ణ ( క్రిష్ ) దర్శకత్వంలోజనవరి 12,2017 న విడుదలయిన ఈ చిత్రం ఒక క్లాసికల్ కమర్శియల్అని చెప్పవచ్చు. బాల చాలా గాప్ తర్వాత బాలయ్య తన పొటెన్షియల్ కి తగ్గ పాత్ర పోషించి మెప్పించారు.

కథ : అఖండ గణ రాజ్యాలుగా విడిపోయిన భారతదేశాన్ని ఒక్క రాజ్యంగా మార్చే లక్ష్యంతో తన తల్లి గౌతమి బాలాశ్రీ కి ఇచ్చిన మాటకు కట్టుబడి యుద్ధాలు చేస్తుంటాడు శాతకర్ణి

కుంతల రాజ్యాన్ని జయించిన శాతకర్ణి కళ్యాణ దుర్గం రాజు ఖాంజీ కి, సౌరాష్ట్ర రాజు నహపాణుడుకి సామంతులుగా మారమని తన దూతల ద్వారా లేఖలు పంపడంతో కథ ఆరంభం అవుతుంది. అయతే, ఆ లేఖను అంగీకరించకుండా నహపాణుడు ఓ దూతను చంపగా, ఖాంజీ మరో దూతను బంధించి యుద్ధానికి సిద్ధమవుతారు. మొదటి యుద్ధంలో ఖాంజీని ఓడించి కళ్యాణ దుర్గాన్ని సొంతం చేసుకుంటాడు శాతకర్ణి. ఇలా యుద్దం చేస్తూ తనకన్నా తక్కువ సైన్యం ఉన్నప్పటికీ తనతో ధీటుగా పోరాడే శాతకర్ణిని అడ్డుకునేందుకు తన సహాయకురాలు, కళ్యాణదుర్గం యుద్ధంలో శాతకర్ణి చేతిలో మరణించిన పరితస్ అనే గ్రీకు సైన్యాధ్యక్షుడి ప్రియురాలు అథెనా ను పంపుతాడుడెమెత్రియస్. అథెనా రాయబారిగా నటించి శాతకర్ణి ఒంట్లో విషం నింపి అతడు కుప్పకూలేలా చేస్తుంది. బౌద్ధ గురువిచ్చిన విరుగుడు మందుతో చికిత్స పొందుతూ మరుసటి రోజున యుద్ధానికి వెళ్ళలేకపోతాడు శాతకర్ణి. అతడి ఆశయాన్ని అర్థం చేసుకున్న సామంతులు డెమెత్రియస్ సేనను ఎదురుకోవడం మొదలుపెడతారు. ఇంతలో శాతకర్ణి తిరిగొచ్చిడెమెత్రియస్ ను ఓడించి అతడిని చంపకుండా, భారతదేశపు సమైక్యతను దెబ్బతీయడం ఎవరివల్ల కాదని ప్రపంచానికి తన మాటగా చాటిచెప్పమని చెప్పడంతో కథ ముగుస్తుంది.

క్రిష్ దర్శకత్వ ప్రతిభ, సిరివెన్నెల సాహిత్యం ,చిరంజన దాస్ సంగీతం వెరసి చిత్రాన్ని క్లాసికల్ గా నిలబెట్టయి .

రాజకీయ జీవితం

1983 లో తెలుగు దేశం పార్టీ స్థాపించినప్పటి నుండి 2014 దాకా పార్టీ తరపున ప్రచారం చేయడమే తప్ప ప్రత్యక్షంగా రాజాకీయాలలో పాల్గొనలేదు. మొట్టమొదటి సారి తన తండ్రి గారికి అలాగే అన్నయ్య హరికృష్ణ గారికి కలిసి వచ్చిన టి.డి.పి కి కంచుకోట లాంటి హిందూపూర్ నియోజక వర్గం నుండి 2014 లో అఖండ మెజారిటీతో శాసన సబ్యులుగాగెలుపొందారు. ఆ తర్వాతా 2019వ సంవత్సరంలో కూడా ఆయన ఎన్నికల్లో గెలుపొందారు.

సేవ కార్యక్రమాలు

బసవ తారకం ఇండో–అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ : స్వర్గీయ తారక రామారావు,బసవతారకమ్మ గార్ల జ్ఞాపకార్తము జూన్ 22 2000 సంవత్సరం లో ప్రారంభించబడింది. అత్యాధునిక సౌకర్యాలతో ప్రతి రోజు కొన్ని వందల మందికి సేవ లందిస్తుంది. బలకృష్ణగారు దగ్గరుండి నిర్వహణ,పరిశీలన చేయడం కూడా ప్రాచుర్యానికి ఒక కారణం. సేవా కార్యక్రమాలు వేగవంతం చేసేందుకు త్వర లో ఎన్‌బీకే సేవా సమితి(ట్రస్టు)ను ప్రారంభిస్తున్నట్లు సినీ నటుడు, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ చెప్పారు. ఎన్టీఆర్ స్వగ్రామమైన కృష్ణాజిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా నిర్మించిన మంచినీటి ఆర్వో ప్లాంటును  శనివారం ఆయన ప్రారంభించారు. తన అభిమానులను సేవా కార్యక్రమాల్లో నిమగ్నం చేసేందుకు తానే చైర్మన్‌గా ఈ ట్రస్టును ప్రారంభించనున్నట్లు బాలకృష్ణ చెప్పారు.

ఇటీవలే 60 వసంతాలు పూర్తి చేసుకున్న బాలయ్య, తన డ్రీమ్ ప్రాజెక్ట్  నర్తనశాలతో  105 చిత్రాలు పూర్తయ్యాయి. మరిన్ని గొప్ప సినిమాలు తీస్తూ, ప్రేక్షకులని అలరిస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.