తమిళంలో విభిన్న సినిమాలని చేసే స్టార్ హీరో ఆర్య ఇంకో కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు రాబోతున్నారు. రియల్ లైఫ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆర్య, సాయేషా సైగల్ జంట కలిసి నటిస్తున్న సినిమా ‘టెడ్డి’ . ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠంగా ఉంది. ఇక ఇండియాలో మొదటిసారి ఒక టెడ్డి బేర్ బొమ్మ ప్రధాన పాత్రగా రాబోతున్న ఈ సినిమా నుంచి స్నేహం మీద ఒక మంచి పాట విడుదలయ్యింది. తమిళ రాక్ స్టార్ అనిరుద్ తన గాత్రంతో ఈ పాటకి ప్రాణం పోసాడు. ఇక ఈ వీడియో సాంగ్ లో మనం సినిమాలో ఆర్యకి టెడ్డికి మధ్య ఉన్న అనుబంధాన్ని చూడొచ్చు. నంబియే అనే ఈ బ్యూటీఫుల్ సాంగ్ కి డి. ఇమాన్ సంగీతం అందించారు. టెడ్డి బేర్, ఆర్య మధ్య స్నేహం చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. ఇక డిస్నీ హాట్ స్టార్ మల్టీప్లెక్స్ ఓ.టి.టి లో విడుదల కాబోతున్న ఈ సినిమా మీద ఆర్య అభిమానుల నుంచి సాధారణ ప్రేక్షకుల వరకు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మెడికల్ ఇండస్ట్రీలో జరిగే మిస్టరీ ని ఛేదించడానికి ఆర్య, టెడ్డి బేర్ కలిసి చేయబోయే అడ్వెంచరిస్ ని చూడలంటే మార్చి 12 వరకు ఆగాలి