థాంక్యూ’ సినిమాతో నాగ చైతన్య మీకు కావాల్సినంత భోజనం పెట్టేస్తాడు.. సినిమా అందరి హృద‌యాల్లో నిలిచిపోతుంది : నిర్మాత దిల్‌రాజు!!

యువ సామ్రాట్ అక్కికేని నాగ చైత‌న్య హీరోగా దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్ అసోసియేష‌న్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేష‌న్‌తో శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. జూలై 22న సినిమా విడుదలవుతుంది. మంగ‌ళ‌వారం ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో...
ర‌చ‌యిత బి.వి.ఎస్‌. ర‌వి మాట్లాడుతూ ‘‘ఒక వ్య‌క్తి మ‌ర‌ణంతో 2015లో  ‘థాంక్యూ’ క‌థ పుట్టింది. క‌థ తీసుకుని వెళ్లి దిల్‌రాజుగారిని క‌లిశాను. గంట‌సేపు క‌థ చెప్పాను. గంట‌లో ఆయ‌న రెండు నిమిషాల క‌థ మాత్ర‌మే బావుంద‌ని మిగిలిన చెత్తంతా తీసేశారు. ఆ రెండు నిమిషాల పాయింట్‌తో క‌థ‌ను అల్ల‌మ‌ని అన్నారు. రెండు, మూడేళ్లు కసరత్తులు చేశాం. ఎవ‌రు డైరెక్ట్ చేస్తారా? అని ఆలోచించి విక్ర‌మ్ కుమార్ చేతిలో పెట్టాం. ఆయ‌న ఈ క‌థ‌ను సినిమా చేశార‌ని గ‌ర్వంగా చెప్ప‌గ‌ల‌ను. అద్భుత‌మైన డైరెక్ట‌ర్‌. మంచి క‌థ‌ను సోల్‌ఫుల్‌గా స్క్రీన్‌పైన విక్ర‌మ్ కుమార్‌గారు.. పి.సి.శ్రీరామ్‌గారు చూపించారు. నాగ చైత‌న్య‌తో ప‌ని చేయాల‌ని ఎంత ఆతృత‌గా వెయిట్ చేశానో నాకే తెలుసు. నా కెరీర్ అసిస్టెంట్ రైట‌ర్‌గా స్టార్ట్ అయ్యిందే అన్న‌పూర్ణ స్టూడియోస్‌తో. ఆహా అనే సినిమాతో. ఆ త‌ర్వాత స‌త్యం సినిమాతో రైట‌ర్‌గా మారాను. త‌ర్వాత నాగార్జున‌గారితో కింగ్ అనే సినిమా చేయ‌డానికి అవ‌కాశం దొరికింది. అలాంటి నాకు చైత‌న్య‌తో చేయాల‌ని చాలాసార్లు ట్రై చేశాను. ఈ సినిమా వ‌ల్ల‌.. క‌థ వ‌ల్ల రాజుగారి వ‌ల్ల‌, విక్ర‌మ్ కె.కుమార్‌గారి వ‌ల్ల చైత‌న్య‌గారితో పని చేశాను. చైత‌న్య ఈ సినిమాలో ఫెంటాస్టిక్‌గా పెర్ఫామ్ చేశాడు. ఒక్కొక్క రియాక్ష‌న్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా చేశాడు. ఈ సినిమాలో కుర్రాడిలా క‌న‌ప‌డ‌టానికి త‌నెంత క‌ష్ట‌ప‌డ్డాడో నాకు తెలుసు. ఈ సినిమాలో ఆమె ఒక్క రియాక్ష‌న్ వ‌ల్ల‌నే ఈ క‌థంతా స్టార్ట్ అవుతుంది.  ఆ రియాక్ష‌న్‌ను ఆమె అద్భుతంగా చేసినందుకు ఆమెకు థాంక్స్‌. అలాగే త‌మ‌న్‌గారికి, పి.సి.శ్రీరామ్‌గారికి థాంక్స్‌’’ అన్నారు.
సాయి సుశాంత్ మాట్లాడుతూ ‘‘చైతు అన్నకు నేను చాలా పెద్ద ఫ్యాన్. ఆయ‌న‌తో సినిమా చేయ‌ట‌మే కాదు.. ప్ర‌తిరోజూ రెండు గంట‌ల పాటు హాకీ ఆడేవాడిని. ఆయ‌న్నుంచి చాలా విష‌యాలు నేర్చుకున్నాను. విక్ర‌మ్‌గారు నన్ను చిన్న త‌మ్ముడిలా చూసుకున్నారు. ఈ సినిమా ఎక్స్‌పీరియెన్స్‌ను మ‌ర‌చిపోలేను. దిల్‌రాజుగారికి థాంక్స్‌. బ్యూటీపుల్ పాత్ర‌ను రాసిన ర‌విగారికి ధ‌న్య‌వాదాలు. రాశీగారంటే నాకు చాలా పెద్ద క్ర‌ష్. సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది’’ అన్నారు.
డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ మాట్లాడుతూ ‘‘చైతన్యగారికి, రాశీగారికి, దిల్‌రాజుగారికి, ర‌విగారికి అంద‌రికీ థాంక్స్‌. చాలా మంచి టీమ్ కుదిరింది. క‌చ్చితంగా సినిమాను అంద‌రూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.
రాశీ ఖ‌న్నా మాట్లాడుతూ ‘‘ఎదుటి వారి ప‌ట్ల కృత‌జ్ఞ‌త‌తో ఉండ‌టం అనే దానికి నేను చాలా ప్రాముఖ్య‌త‌నిస్తాను. అందుక‌నే ఈ స్క్రిప్ట్ నాకు బాగా న‌చ్చింది. ఇంత మంచి క‌థ‌, స్క్రిప్ట్ రాసిన బి.వి.ఎస్‌.రవిగారికి థాంక్స్‌. విక్ర‌మ్ కుమార్‌గారితో క‌లిసి ప‌నిచేయ‌టాన్ని గౌర‌వంగా భావిస్తున్నాను. ప్రియా అనే మంచి పాత్ర‌ను నాతో చ‌క్క‌గా చేయించారు. అలాగే పీసీ శ్రీరామ్‌గారికి కూడా థాంక్స్ చెప్పాలి. నన్ను చాలా అందంగా చూపించాలి.  ప్ర‌తి ప్రేమ్ ఓ పెయింటింగ్‌గా ఉండాలి. చైత‌న్య అమేజింగ్ కోస్టార్‌. ఈ సినిమా కోసం త‌ను ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌ను చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్ అని భావిస్తున్నాను. క‌చ్చితంగా ఈ సినిమా త‌ర్వాత అంద‌రూ చైత‌న్య ఇంకా ఎక్కువ‌గా ప్రేమిస్తారు. మాపై న‌మ్మ‌కంతో సినిమా చేసిన దిల్‌రాజుగారికి థాంక్స్‌. జూలై 22న సినిమా రిలీజ్ అవుతుంది. మీ స‌పోర్ట్ మాకు అవ‌స‌రం’’ అన్నారు.
చిత్ర నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. చైత‌న్య‌ మూడు వేరియేష‌న్స్‌లో మీకు కావాల్సినంత భోజ‌నం ఇచ్చేస్తాడు. అభిమానుల‌ను చైతు ఎగ్జ‌యిట్ చేస్తాడు. థాంక్యూ సినిమాను ఎందుకు చూడాలి? అభిమానులైతే చైతు కోసం చూస్తారు. మ‌రి కామ‌న్ ఆడియెన్స్ ఎందుకు చూడాలి? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఏంటంటే.. ఈమ‌ధ్య మ‌నం ట్రిపుల్ ఆర్ చూశాం.. ఇద్ద‌రు స్టార్ హీరోల‌ను చూసి వావ్ అనుకున్నాం. వారు ఇర‌గొట్టేశారు. అలాగే కె.జి.య‌ఫ్ చూశాం.పుష్ప చూశాం, స‌ర్కారువారి పాట చూశాం. ఇలా ర‌క‌ర‌కాల సినిమాలు చూస్తున్నాం. ఇవ‌న్నీ స్టార్ హీరోల‌తో మ‌న‌కుండే ఎక్స్‌పీరియెన్స్‌. అలాగే థాంక్యూ సినిమా చూసిన‌ప్పుడు మ‌న హృద‌యంలో ఓ ఫీలింగ్ క‌లుగుతుంది. సినిమా థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు రాగానే మ‌న‌కు కావాల్సిన వారికి కొంత మందికి అయినా ఫోన్ చేస్తారు. ఈ సినిమా మ‌న హృద‌యంలో ఉండిపోతుంది. మన కెరీర్‌లో, లైఫ్‌లో ఏం పొగొట్టుకుంటున్నామో ఒక్క‌సార‌న్నా ఆలోచించుకునే సినిమా థాంక్యూ. ర‌వితో పాటు క‌ళ్యాణ్‌, చైత‌న్య‌,  వెంకీ అంద‌రూ ఓ టీమ్‌.. అందరికీ థాంక్స్‌. ఇష్క్‌, మ‌నం, 24 వంటి బ్యూటీఫుల్ సినిమాలు తీసిన విక్ర‌మ్ కుమార్‌. పి.సి.శ్రీరామ్‌గారితో క‌లిసి అందమైన పెయింటింగ్‌గా చెక్కారు. మా సంస్థ‌కు విక్ర‌మ్ ఓ అద్భుత‌మైన సినిమాను ఇచ్చారు. రాశీఖ‌న్నా, మాళ‌వికా నాయ‌ర్‌, అవికాగోర‌వ్ ఇలా ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. సుశాంత్‌, ప్ర‌కాష్‌రాజ్‌గారు ఇలా చాలా మంది ఆర్టిస్టులున్నారు. జోష్ వంటి కాలేజ్ యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ మూవీ అనుకుని చైత‌న్య‌ను లాంఛ్ చేశాం. త‌ర్వాత చైత‌న్య‌కు జోష్‌తో అనుకున్న రిజ‌ల్ట్ రాలేదు. త‌ర్వాత మ‌రో మంచి సినిమా చేయ‌డానికి 12 ఏళ్లు ప‌ట్టింది. చైత‌న్య ఏమో ఒక్కో సినిమాతో ఎదుగుతూ వ‌చ్చారు. బ్యూటీఫుల్ సినిమా చేయాల‌ని అనుకున్నప్పుడు ఈ క‌థ రావ‌టం దాన్ని చైత‌న్య‌కు చెప్ప‌డం, విక్ర‌మ్ కుమార్ బోర్డ్ పైకి రావ‌టంతో థాంక్యూ సినిమా చేశాం. వారిద్ద‌రూ క‌లిసి అభిమానుల‌కే కాదు.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు వారు ఓ మంచి సినిమాను అందిస్తున్నారు. నాగార్జున‌గారి  శివ‌, నిన్నే పెళ్లాడ‌తా, అన్న‌మ‌య్య సినిమాలు ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోతాయి. అలాగే థాంక్యూ సినిమా  ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టికీ గుర్తిండిపోతుంది. అద్భుత‌మైన సినిమాను చేశాం. రేపు సినిమాను చూసి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు గొప్ప ఫీలింగ్‌తో బ‌య‌ట‌కు వ‌స్తారు. జూలై 22న థియేట‌ర్స్‌కు వ‌స్తే.. మంచి ఫీలింగ్‌తో ఇంటికి వెళ‌తారు’’ అన్నారు.
అక్కినేని నాగ చైత‌న్య మాట్లాడుతూ ‘‘‘థాంక్యూ’ సినిమా అనేది అభిరామ్ అనే యువకుడి జర్నీ. ఓ యాక్ట‌ర్‌గా ఇలాంటి వేరియేష‌న్స్ చూపించే సినిమా అన్నిసార్లు రాదు. ఇంత మంచి సినిమా చేసిన మా డైరెక్ట‌ర్ విక్ర‌మ్, నిర్మాత దిల్‌రాజుగారికి, రైట‌ర్ ర‌విగారికి థాంక్యూ చెబుతున్నాను. చాలా లేయ‌ర్స్‌ను సినిమాలో చూపిస్తున్నాం. అభిరామ్ జీవితంలో వాటిని చ‌క్క‌గా చూపించాం. ల‌వ్‌స్టోరి, రిలేష‌న్ షిప్స్‌, అమ్మ‌, నాన్న‌, చెల్లి, అన్న‌య్య‌.. ఇలా అన్నింటిని చూపించాం. ఇన్ని వేరియేష‌న్స్ ఉండ‌టం వ‌ల్ల సినిమాలో చాలా స్పాన్ దొరికింది. విజువ‌ల్‌గానే కాదు.. మ్యూజిక‌ల్‌గా కూడా. రేపు థియేట‌ర్‌లో సినిమా చూసే ప్రేక్ష‌కుడికి థాంక్యూ బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది. ఓ యాక్ష‌న్ సినిమాలో యాక్ష‌న్ స‌న్నివేశాల్లో అభిమానులు ఎలా హుక్ అవుతారో.. అభిరామ్ జ‌ర్నీ స్టార్ట్ కాగానే ఇందులో హుక్ అవుతారు. నేను సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. స్క్రిప్ట్ విన్న‌ప్పుడు మన జీవితంలో ఎవ‌రికైనా స్పెష‌ల్ ప‌ర్స‌న్‌కి ఫోన్ చేసి థాంక్యూ చెప్పాల‌నిపించింది. అదే ఫీలింగ్‌తో ముందుకెళ్లాం. ప్రేక్ష‌కుల‌కు కూడా అదే ఫీలింగ్ వ‌స్తుంది. ఏ జ‌ర్నీకైనా మంచి టీమ్ కావాలి. అలాంటి మంచి టీమ్ నాకు దొరికింది. పాండ‌మిక్ ముందు స్టార్ట్ చేసిన సినిమా పాండ‌మిక్ త‌ర్వాత రిలీజ్ అవుతుంది. దాదాపు మూడు నాలుగేళ్లు అందరం ట్రావెల్ అయ్యాం. చాలా లొకేష‌న్స్‌లో చేశాం. రాజుగారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. థాంక్యూ సినిమా ముందు విక్ర‌మ్‌తో నాకు ఒక లాంగ్ జ‌ర్నీ ఉంది. ఇప్ప‌టికీ అది కంటిన్యూ అవుతూనే ఉంది. విక్ర‌మ్‌తో ఉన్న అనుబంధంపై చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంత మంచి ఆలోచ‌న‌తో ముందుకు వ‌చ్చిన రవిగారికి థాంక్స్‌. పి.సి.శ్రీరామ్‌గారితో క‌లిసి ప‌ని చేయాల‌నేది నా డ్రీమ్‌. ఆ క‌ల‌ను రాజుగారు, విక్ర‌మ్ నేర‌వేర్చారు. అలాగే త‌మ‌న్‌కు థాంక్స్‌. ఎడిట‌ర్ న‌వీన్ నూలికి స్పెష‌ల్ థాంక్స్‌. రాశీ ఖ‌న్నా లేక‌పోతే ఈ సినిమా జ‌ర్నీనే స్టార్ట్ కాదు. త‌ను మంచి ఫ్రెండ్, కో యాక్ట‌ర్‌. సుశాంత్‌కి థాంక్స్‌. అడ‌గ్గానే ఒప్పుకున్నందుకు థాంక్స్‌. అలాగే మాళ‌విక‌, అవికా, ప్ర‌కాష్ రాజ్‌గారు, తుల‌సిగారు ఇలా చాలా మంది సినిమాను స‌పోర్ట్ చేశారు. జూలై 22న సినిమా రిలీజ్ అవుతుంది.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.