
అక్టోబర్ 23 మన రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. ఆ రోజు రాబోయే కొత్త సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు వేచి చూస్తుంటారు. ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాలకు కమిటైన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన చేస్తున్న రాధే శ్యామ్ కాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా, ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ లో నటించనున్నారు ప్రభాస్. ఇక ప్రభాస్ పుట్టినరోజున ఈ మూడు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ
నేపథ్యంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ను అప్డేట్స్ కోసం అభిమానులు సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి అడగ్గా. ఈరోజు నాగ్ అశ్విన్ ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఇంకా షూట్ మొదలవ్వడానికి చాలా సమయం ఉన్న కారణంగా పుట్టినరోజుకు భారీ అప్డేట్ ఏం ఉండబోదని అన్నారు. అయితే పుట్టినరోజు లోగా ఈ సినిమాకు సంబంధించి ఒక కిల్లర్ అప్డేట్ ను ఇస్తానని ఆయన ప్రకటించారు ఇప్పుడు ఆ అప్డేట్ ఏమై ఉంటుందా అని అందరూ అనుకుంటున్నారు.
‘బాహుబలి’ చిత్రంతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న మన రెబెల్ స్టార్, ‘మహానటి’ చిత్రంతో ప్రేక్షకాధరణను పొందిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఇద్దరూ కలిసి చేయబోయే సినిమా అవ్వడం వాల్ల ఆ చిత్రం మీద భారి అంచనాలునెలకొన్నాయి.