
ఉదయ్ శంకర్ హీరోగా నటిస్తున్న సినిమా నచ్చింది గాళ్ ఫ్రెండూ. జెన్నీ
నాయికగా నటిస్తోంది. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య
సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్నారు. గురు పవన్ దర్శకత్వం
వహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 11న రిలీజ్ అవుతోంది. తాజాగా సినిమా
సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూఏ
సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా బాగుందని సెన్సార్ సభ్యులు అప్రిషియేట్
చేశారు. చక్కని థ్రిల్లింగ్ లవ్ స్టొరీ గా రూపొందిన ఈ సినిమా సెన్సార్
సభ్యులు ప్రశంసలు అందుకుంది.
వైజాగ్ నేపథ్యంగా థ్రిల్లర్ ఎలిమెంట్ తో సాగే లవ్ స్టోరి ఇది. సినిమాలో
ఆహ్లాదకరమైన ప్రేమ కథతో పాటు ఆసక్తిని పంచే థ్రిల్లింగ్
అంశాలుండబోతున్నాయని మూవీ టీమ్ చెబుతున్నారు.
నటీ నటులు: ఉదయ్ శంకర్, జన్నీఫర్ ఇమ్మానుయేల్, సీనియర్ హీరో సుమన్,
మధునందన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యాంగార్, సనా, కళ్యాణ్ తదితరులు
సాంకేతక వర్గం: సినిమాటోగ్రఫీ : సిద్దం మనోహార్, మ్యూజిక్: గిఫ్టన్, ఎడిటర్:
ఉడగండ్ల సాగర్, ఆర్ట్: దొలూరి నారాయణ, పి.ఆర్.ఓ: జియస్ కె మీడియా,
నిర్మాత : అట్లూరి నారాయణ రావు, దర్శకత్వం : గురు పవన్