
తమిళ సినిమాల్లో తనదైన మార్క్ ని చూపించిన దర్శకుడు మురుగదాస్.. అప్పటివరకు ఓ మూసలో పోతున్న తమిళ సినిమా ధోరణిని కొత్త రకం స్టైల్ లో తీసుకెళ్లి బ్లాక్ బస్టర్ సినిమాలు ఎలా చేయాలో నేర్పించాడు.. మురుగదాస్ అనగానే అందరికి గజినీ సినిమానే గుర్తొస్తుంది.. హీరో సూర్య ని అప్పటిదాకా అలా చూపించిన దర్శకుడు లేదు.. సూర్య అనే కాదు తమిళంలో అలాంటి సినిమా అప్పటివరకు రాలేదు.. అక్కడనే కాదు దేశంలోనే అలాంటి సినిమా రాలేదు.. నిజానికి హీరో కి డిజార్డర్ ఉన్న సినిమా లు స్టార్ట్ అయ్యింది ఈ సినిమా తోనే..

అప్పటివరకు ఓ నార్మల్ డైరెక్టర్ గా ఉన్న మురుగదాస్ ఈ సినిమా తో స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఇక్కడ వచ్చిన పాపులారిటీ తోనే టాలీవుడ్ నుంచి ఆయనకు ఏకంగా మెగా స్టార్ నుంచి పిలుపొచ్చింది. స్టాలిన్ సినిమా ని తెలుగులో మురుగదాస్ డైరెక్ట్ చేయగా కాన్సెప్ట్ బాగానే ఉన్నా సినిమా కమర్షియల్ గా ఎక్కలేదు.. ఆ తర్వాత మళ్ళీ తమిళంలోకి వెళ్లి అక్కడ సూపర్ హిట్ సినిమాలు చేస్తూ వచ్చాడు.. అయితే మరో తెలుగు సినిమా చేయడానికి ఆయనకు చాలా టైం పట్టింది. మహేష్ స్పైడర్ సినిమా తో తెలుగులో మరొక ప్రయత్నం చేసిన అదీ వర్క్ అవుట్ కాలేదు.

ఇక తెరముండు ఇంతటి స్టార్ డమ్ ఉన్న మురుగదాస్ కి తెరవెనుక ఎన్నో కష్టాలున్నాయని ఎవరైనా ఊహించగలరా.. తండ్రి కూలి పని చేస్తూ తనని చదివించేవాడు. అప్పటికే సినిమాల మీద ఆసక్తి ఉన్న మురుగదాస్ ఎలాగోలా డిగ్రీ పూర్తి చేసి చెన్నై కి చేరుకున్నాడు. నెలకు 500 ల రూపాయలతో అయన జీవం సాగించేవారు. రోజుకు ఒక్క పూట మాత్రమే తింటూ ఉన్న సమయంలో ఇంటి దగ్గరినుంచి వచ్చే కాస్త డబ్బు కూడా రావడం ఆగిపోయింది. ఎం చేయాలో తెలీక బట్టలుతికే పనిచేసేవాడు. అందుకు ఆయనకు ఒక్క రూపాయి ఇచ్చేవారట. చేతిలో డబ్బు లేక ఆరునెలలు రెంట్ కట్టలేదట.. దాంతో ఓనర్ మురుగదాస్ కష్టాలు చూసి మరో ఆరు నెలలు అద్దె కట్టకున్నా పర్వాలేదన్నాడట..

ఓ ఫ్రెండ్ సహాయంతో అమృతం అనే రైటర్ వద్ద పనిలో చేరాడు. ఎన్నో సినిమాలకు పనిచేశాడు. దీంతో సినిమా ఇండస్ట్రీలో మురుగదాస్‌కు పరిచయాలు పెరిగాయి.ఆయనకు సినిమా పై ఉన్న ఫ్యాషన్ ఎలాంటిది అంటే తన తండ్రి చనిపోయినా అయన ఆఖరి చూపుకు నోచుకోలేదట. ఇదే తనకు తీవ్రమైన దుఃఖాన్ని తెప్పిస్తోందట. క్రమంగా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ప్రారంభించాడు.వాలి సినిమా తో అజిత్ తో స్నేహం ఏర్పడింది.. నిజానికి గజినీ అజిత్ తో చేయాల్సిందే.. చివరికి సూర్య తో చేశాడు. ఆ తర్వాత అయన ప్రయాణం అందరికి తెలిసిందే.. ఇలా ఓ నార్మల్ వ్యక్తి నుంచి ఓ స్టార్ వరకు అయన ప్రయాణం ఎంతో అసాధారణమైందని చెప్పొచ్చు.