మర్డర్ సినిమా విడుదలపై స్పందించిన వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు. వర్మ దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కించిన చిత్రం ‘మర్డర్’. ఆనంద్ చంద్ర దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్, క్విటీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యకేసు ఆధారంగా మర్డర్ చిత్రం తెరకెక్కింది. అయితే ప్రణయ్ కుటుంబసభ్యులు అభ్యంతరాలు చెప్పడంతో నల్లగొండ కోర్టు ఈ చిత్ర విడుదలను నిలిపివేసింది. కానీ హైకోర్టు నిన్న మర్డర్ చిత్ర విడుదలకు లైన్ క్లియర్ చేయడంతో రామ్ గోపాల్ వర్మ ప్రెస్ మీట్ పెట్టాడు. హైకోర్టు నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేసాడు. అమృత, ప్రణయ్ ల ఉదంతంపై సినిమా తీయలేదని, ఆ సంఘటనలను ఆధారంగా చేసుకుని మాత్రమే తాను సినిమాను తెరకెక్కించానని తెలిపాడు. "ఇప్పటికే ఈ కేసు గురించి మీడియాలో అనేకసార్లు వివిధ రకాలుగా ప్రచారం జరిగింది. దీంతో కొత్తగా నేను చూపించేది అంటూ ఏం లేదు. ఈ చిత్రం ద్వారా ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అన్న విషయాన్ని నేను చెప్పలేదు. కేవలం ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయా అన్న విశ్లేషణ మాత్రమే ఈ చిత్రమని" రామ్ గోపాల్ వర్మ తెలియజేసాడు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.