పవన్ జోడిగా ముదురుభామ.. ఆగ్రహంలో ఫ్యాన్స్..!!

వకీల్ సాబ్ సూపర్ హిట్ తర్వాత పవన్ తన తర్వాతి సినిమాల పనుల్లో ఉన్నాడు. ప్రస్తుతం ఏకే రీమేక్ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కి త్రివిక్రమ్ రచన చేస్తుండగా  ఇప్పటికే  ఎనభై శాతం పూర్తయ్యింది సినిమా.. త్వరలోనే మిగితా పార్ట్ కూడా కంప్లీట్ చేసి నెక్స్ట్ సినిమాలకు వెళతాడట పవన్..

ఈ సినిమా లో పవన్‌కు జోడీగా ముందు సాయిపల్లవి ఎంపిక కావడం, కానీ డేట్లు సర్దుబాటు చేయలేక ఆమె తప్పుకోవడం తెలిసిన సంగతే. మలయాళంలో గౌరి నంద అనే అమ్మాయి చేసిన పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుంది. గిరిజనురాలైన నక్సలైట్ పాత్ర తనది. ఇళాంటి పాత్రను ఎవరు పడితే వాళ్లు చేయలేరు. మంచి నటి అయి ఉండాలి.

నిడివి తక్కువే అయినా పేరున్న నటినే ఈ పాత్ర కోసం తీసుకోవాల్సి ఉండటంతో ఆర్టిస్టును ఖరారు చేయడంలో ఆలస్యం జరిగింది. ఐతే ఎట్టకేలకు ఆ పని పూర్తయినట్లు సమాచారం. సాయిపల్లవి కంటే ముందు తెలుగులో మంచి గుర్తింపు సంపాదించిన మరో మలయాళ నటి నిత్యా మీనన్‌ను ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌లో పవన్‌కు జోడీగా ఖాయం చేసినట్లు తాజా సమాచారం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.