అప్పుడు డర్టీ హరి ఇప్పుడు 7 డేస్ సిక్స్ నైట్స్

ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. గత ఏడాది ‘డర్టీహరి’ చిత్రం మంచి విజయాన్ని అందుకున్నారు. నిర్మాతగా మ్యాక్జిమమ్ సక్సస్ రేట్ ఉన్న నిర్మాతల్లో ఆయన కూడా ఒకరు. శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి ఎన్నో బ్లాక్బస్టర్స్ ని ఆయన అందించారు. దర్శకుడిగా కూడా అలానే సక్సస్ అవ్వాలని ఆయన కృత నిశ్చయంతో ఉన్నారు. సుమంత్ ఆర్ట్  ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ‘7 డేస్ 6 నైట్స్’ పేరుతో ఓ సినిమా రూపొందిస్తున్నారు. వింటేజ్ పిక్చర్స్ మరియు  ఏబిజి క్రియేషన్స్ వారు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. దీనికి నిర్మాతలుగా సుమంత్అశ్విన్, రజనీకాంత్.ఎస్ వ్యవహరించనున్నారు.

ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ “ఎన్నో మెగా హిట్ చిత్రాలను నిర్మించినమా నాన్నగారి సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఈ '7 డేస్ 6 నైట్స్' సమర్పిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దర్శకుడిగా మరో భారీ విజయానికి నాన్నగారు శ్రీకారం చుడుతున్నారు. జూన్ 7న చిత్రీకరణ ప్రారంభించాలని అనుకుంటున్నాం. కొంత హైదరాబాద్, మరికొంత  గోవా, మంగుళూరు, అండమాన్ నికోబర్ దీవుల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం నటీనటుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నాం. ‘డర్టీ హరి’ తో తన సత్తా చూపించిన నాన్నగారు, మరో విభిన్నమైన జానర్ లో ఈ సినిమా చేయనున్నారు” అని అన్నారు.

ఎంఎస్ రాజు మాట్లాడుతూ "యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ఈ సినిమా ఉంటుంది. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది. సంగీతం, ఇతర సాంకేతిక అంశాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కిస్తాం. గత ఏడాది నా దర్శకత్వంలో వచ్చిన ‘డర్టీ హరి’తో నా జీవితం కొత్త మలుపు తీసుకుంది. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి, చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ప్రశంసలు మరువలేనివి. 'డర్టీ హరి'ని మించి ఈ సినిమా ఉంటుంది” అని అన్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.