‘మిస్టర్ కింగ్’ యూత్, ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సినిమా.. ప్రేక్షకులు విజల్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తారు: దర్శకుడు శశిధర్‌ చావలి!!

విజయనిర్మల గారి మనవడు శరణ్‌ కుమార్‌ (నరేశ్‌ కజిన్‌ రాజ్‌కుమార్‌ కొడుకు)  హీరోగా,  శశిధర్‌ చావలి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్టర్‌ కింగ్‌’. హన్విక క్రియేషన్ బ్యానర్ బి.ఎన్‌.రావు నిర్మించారు. యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్‌ కథానాయికలుగా నటించారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. అలాగే టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 24న ‘మిస్టర్‌ కింగ్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు శశిధర్‌ చావలి ‘మిస్టర్ కింగ్’ విశేషాలని విలేఖరుల సమావేశంలో పంచుకున్నారు.

మీ సినీ ప్రయాణం గురించి?
‘నా ఇష్టం’ సినిమాతో సహాయ దర్శకుడిగా నా సినీ ప్రయాణం మొదలుపెట్టాను. అలాగే బాహుబలి పార్ట్ 1 కి ఎడిటింగ్ డిపార్ట్ మెంట్ లో పని చేశాను. తర్వాత విరించి తో కలసి మజ్ను సినిమాకి పని చేశాను. తర్వాత సొంతగా ప్రయత్నాలు చేసిన ‘మిస్టర్ కింగ్’ చేశాను. మధ్యలో కరోనా కారణంగా సినిమా మొదలు కావడానికి కొంత జాప్యం జరిగింది. అయితే ఒక్కసారి మొదలైన తర్వాత ఎక్కడా ఆగలేదు.

మిస్టర్ కింగ్ కథ గురించి ?
మంచి క్యారెక్టర్ వున్న ఓ కుర్రాడి ప్రయాణం, ప్రేమకు సంబధించిన కథ ఇది. తనకి తప్పు చేయడం రాదు. నమ్మిన దానిపై నిలబడతాడు. తన ప్రేమ ఎలా వుంటుంది, తను పడే కష్టం ఎలా వుంటుంది ? చుట్టూ ఎలాంటి పరిస్థితులు వుంటాయి ? దినిని బేస్ చేసుకొని రాసి కథ ఇది.

ఇలాంటి పాత్ర నిజ జీవితంలో మీకు ఎదురుపడిందా ?
ఇలాంటి పాత్రలని బయట చూడలేదు కానీ లాగ్ లైన్ రాయమని అడిగినపుడు.. ఆకలి రాజ్యం లో కమల్ హసన్ క్యారెక్టర్ కానీ అంత లౌడర్ గా వుండదు. జల్సాలో పవన్ కళ్యాణ్ గారిలాగ అన్నిటిని కూల్ గా తీసుకునే క్యారెక్టర్. అలాగే డిడిఎల్జే  లవ్ స్టొరీ లో ఇలాంటి క్యారెక్టర్ వుంటే ఎలా వుంటుంది ? ఇలా మిస్టర్ కింగ్ పాత్రని చెప్పొచ్చు. అలాగే అతనకి ఒక ప్రయాణం వుంటుంది. ఏరోనాటికల్ లో కాలుష్యరహిత విమానాన్ని తయారు చేస్తాడు. అలాంటి గొప్ప లక్ష్యాలు వున్న పాత్ర. మంచి వ్యక్తిత్వం వున్న వాడు రాజు. అదే ఈ సినిమా టైటిల్ జస్టిఫికేషన్. సామాన్య ప్రేక్షకుడు తనని తాను హీరోగా చూసుకునే పాత్ర ఇది.

శరణ్‌ కుమార్‌ ని తీసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది ?
పాత్ర నుంచి పుట్టిన కథ ఇది. నేను రాసుకున్న పాత్రకు శరణ్‌ కుమార్‌ యాప్ట్ అనిపించారు. పేస్ కొత్తగా వుంది. ఏ ఇమేజ్ కనిపించడం లేదు. తనని మౌల్ద్ చేయడం ఈజీ. ఒక కొత్త యాక్టర్ తీసుకోచ్చినపుడు ఓ అరగంట కొత్త అతను అని చూస్తారు. తర్వాత క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతారు. అలా శరణ్‌ కుమార్‌ మాకు కనిపించారు. శరణ్‌ కుమార్‌ మిస్టర్ కింగ్ పాత్రని చాలా చక్కగా చేశారు.

ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా కనిపిస్తున్నాయి ? నిర్మాణం గురించి ?
నిర్మాత బిఎన్ రావు గారికి కథ  చాలా నచ్చింది. ఫాదర్ డాటర్ ఎమోషన్స్ కూడా వుంటాయి. క్లైమాక్స్ అందరినీ హత్తుకుంటుంది. సినిమాకి అవసరమైన ప్రతిది ఎక్కడా రాజీపడకుండా సమకూర్చారు. చిన్న సినిమానా పెద్ద సినిమానా అని చూడలేదు. ఒక మంచి సినిమా తీయాలనే ఆలోచనతో ఆ క్యాలిటీ కనిపించేలా బిఎన్ రావుగారు ఎంతగానో హెల్ప్ చేశారు.

షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ?
2021 అక్టోబర్ లో షూట్ స్టార్ట్ చేశాం. ఎక్కువ సమయం ఆర్ఆర్ కోసం పట్టింది. మణిశర్మ గారు చాలా అద్భుతమైన నేపధ్య సంగీతం ఇచ్చారు. ఒక పెద్ద సినిమా, మంచి సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుంది. మంచి సినిమా, ఫీల్ గుడ్ ఫిల్మ్ సినిమా చూశామనే ఆనందంతో ప్రేక్షకులు బయటికి వస్తారు

యశ్విక, ఊర్వీ పాత్ర గురించి ?
ఊర్వీ పాత్ర ప్రాక్టికల్ గా వుంటుంది. యశ్విక సంప్రదాయ పాత్రలో తండ్రి చాటు బిడ్డలా వుంటుంది. రెండు పాత్రలతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.

మిస్టర్ కింగ్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు ?
ఫ్యామిలీ అండ్ యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. యూత్ సెకండ్ హాఫ్ లో విజల్స్ వేసి చప్పట్లు కొట్టే సన్నివేశాలు వుంటాయి. క్లైమాక్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. వెన్నల కిషోర్ కామెడీ హిలేరియస్ గా వుంటుంది. ఇప్పటివరకూ వేసిన స్క్రీనింగ్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.  

ఈ సినిమాలో మీ బ్రదర్ కో ప్రొడ్యూసర్ కదా ?
అవునండీ. ప్రొడ్యూసర్  మా బ్రదర్ వాళ్ళ క్లోజ్ ఫ్రండ్. నా జర్నీ అంతా ఆయన చూశారు. మన ఫ్యామిలీ సినిమాల ఇది చెద్దామని భావించాం. ఒక సమయంలో ఇన్వెస్ట్ మెంట్ అవసరం పడితే మా తమ్ముడు కూడా వచ్చారు.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
నాపై కె విశ్వనాథ్ గారు, మణి రత్నం గారు, త్రివిక్రమ్ గారి ప్రభావం వుంది. ఆ తరహలో యూత్, మాస్ ఎలిమెంట్స్ తో కొన్ని కథలు వున్నాయి. ‘మిస్టర్ కింగ్’ విడుదల తర్వాత కొత్త సినిమా గురించి చెబుతాం.

ఆల్ ది బెస్ట్
థాంక్స్

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.